
మంచిర్యాల జిల్లా కల్యాణ ఖని,శ్రావణపల్లి
కొత్తగూడెం జిల్లా కోయగూడెం
బొగ్గు బ్లాకులను ప్రయివేటు రంగానికి చెందిన వ్యక్తులకు అప్పగించేందుకు కేంద్రం పావులు కదుపుతుండడంతో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) మనుగడే ప్రశ్నార్థకంగా మారనుంది అన్న వార్తల నేపథ్యంలో ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలతో కేసీఆర్ ఉద్యమం చేస్తారా లేదా అన్నది వాదన ఒకటి వినిపిస్తోంది. మరోవైపు గత్యంతరం లేని పరిస్థితుల్లోనే తామంతా సమ్మెకు పోతున్నామని కార్మికులు ముక్త కంఠంతో చెబుతున్నారు.ఈ దశలో కేంద్రంతో సామరస్య పూర్వక చర్చలకు సంబంధిత చర్యలకు పూనిక వహించేందుకు కేసీఆర్ తో పాటు ఇంకొందరు సిద్ధం కావాల్సి ఉంది. ఇప్పటికే సంస్థను రక్షించుకునేందుకు తాము సిద్ధమనేని హరీశ్ రావు తెలిపారు.ఇంకా ఉద్యమం ఉద్ధృతం అయితే ఢిల్లీ వర్సెస్ తెలంగాణ అన్న విధంగా పరిణామాలు మారేందుకు ఆస్కారం ఉంది.
సింగరేణిలో సమ్మె సైరన్ మోగనుంది. రేపటి నుంచి మూడు రోజుల పాటు సమ్మె చేసేందుకు కార్మిక సంఘాలు సిద్ధం అవుతున్నా యి. సంస్థ మనుగడనే ప్రశ్నార్థకం చేసే విధంగా కేంద్రంనిర్ణయాలు ఉండడంతో తమకు ఏం చేయాలో తోచడం లేదని కార్మిక సంఘాలు ఆవేదన చెందుతున్నాయి. సంస్థ పరిధిలో ఉన్న నాలుగు బొగ్గు బ్లాకులను ప్రయివేటు పరం చేయాలన్న ఆలోచనను మరియు ప్రతిపాదనను తక్షణమే ఉపసంహరించుకోవాలి అని కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి.వాస్తవానికి సింగరేణి యాజమాన్యం కార్మిక సంఘాలతో చేపట్టిన చర్చలు విఫలం కావడంతో సమ్మె అనివార్యం అయింది. మరోవైపు కేసీఆర్ కూడా సమ్మెకు బాహాటంగానే మద్దతు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. కేంద్రంతో ఆయన ఇప్పటికే పలు విషయాల్లో కయ్యం పెట్టుకుంటున్న తరుణాన బొగ్గు గనులను ఇతర ప్రయివేటు కంపెనీలకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే ప్రభుత్వం తరఫున కొన్ని విన్నపాలు చేశారు కేసీఆర్. అయినా కూడా కేంద్రం దిగివచ్చేందుకు ఇష్టపడడం లేదు.ఈ దశలో వివాదం ముదిరే అవకాశమే ఉంది. మొదట మూడు రోజుల సమ్మెగానే ఉంటుందని అనుకుంటున్నా, కార్మిక సంఘాల నిరసన ఇంకొన్ని రోజులు కొనసాగే వీలుంది.