
కానీ సహాయం చేసిన వాడి నెత్తిపైన చేతి పెట్టాలి అనే ఉద్దేశంతో ఇక సౌదీ అరేబియా పై ఆధిపత్యం సాధించాలని అనుకున్నది పాక్. ఇది ముందుగానే గ్రహించిన సౌదీ పాకిస్థాన్కు ఇచ్చిన అప్పులు చెల్లించాలంటూ షాక్ ఇచ్చింది. అంతే కాదు అడపా దడపా సంబంధాలు మాత్రం కొనసాగిస్తోంది. ఇలాంటి సమయంలోనే దౌత్య పరంగా ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న భారత్ తో సత్సంబంధాలను ఎప్పటికప్పుడు మెరుగుపరచుకుంటుంది సౌదీ అరేబియా. ఈ క్రమంలోనే ఇటీవలే అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.
సౌదీ అరేబియాకు చెందిన ఆర్మీ చీఫ్ భారత్లో పర్యటించేందుకు సిద్దం అయ్యారు. ఇది కాస్త పాకిస్థాన్కు షాక్ చెప్పాలి. అంతేకాదు ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడూ జరగని సరికొత్త ఘట్టం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మొట్టమొదటిసారి సౌదీ అరేబియా ఆర్మీ చీఫ్ భారత్లో పర్యటించనున్నారు. ఆయుధాల విషయంలో పరస్పరం దేశాలు సహాయ సహకారాలు అందించేందుకు ఒప్పందం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ముందుగా భారత్ పర్యటనకు రావద్దంటూ సౌదీకి సూచించినప్పటికీ సౌదీ వినలేదు. కనీసం భారత పర్యటన ముగిసిన తర్వాత పాకిస్థాన్ పర్యటనకు రావాలని విజ్ఞప్తి చేసిన సౌదీ పట్టించుకోలేదు. ఇలా ఇస్లామిక్ దేశమైన పాకిస్థాన్ ను కాదని భారత్ పర్యటనకు సౌదీ సిద్ధం కావడం మాత్రం సంచలనంగా మారిపోయిందని చెప్పాలి.