ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాలు రష్యాకు సరిహద్దుగా ఉన్న ప్రాంతాల్లో వేర్పాటు వాదం ఎప్పటి నుంచో ఉంది. వారు రష్యాకు అనుకూలంగా ఉంటుంటారు. దేశ అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు రష్యా సేనలతో ఉక్రెయిన్ పోరాడుతుంటే.. ఈ ప్రాంతాల్లోని వేర్పాటు వాదులు మాత్రం తమ ప్రాంతాన్ని రష్యాలో కలపాలని డిమాండ్ చేస్తుండటం కలకలం రేపుతోంది. ఉక్రెయిన్‌లోని తూర్పు ప్రాంతాలైన లుహాన్స్క్ ప్రాంతంలో ఈ డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. తమ ప్రాంతాన్ని రష్యాలో విలీనం చేసేందుకు అవసరమైతే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా లూహాన్స్క్ ప్రాంతంలోని వేర్పాటు వాద నాయకుడు లియోనిడ్ పసెచ్నిక్ ఈ డిమాండ్‌ను గట్టిగా వినిపిస్తున్నారు. రష్యాలో చేరేందుకు లుహాన్స్క్ ప్రజలు సిద్ధంగా ఉన్నారా లేదా అని అన్న విషయంపై ఓటింగ్ నిర్వహించాలని కోరుతున్నారు. ఈ ఓటింగ్ ద్వారా అసలు విషయం తెలిసిపోతుందని వేర్పాటు వాద నాయకుడు లియోనిడ్ పసెచ్నిక్ అంటున్నారు. ఈ ప్రాంతంలోని వేర్పాటు వాదానికి బలమైన మూలాలు ఉన్నాయి.
2014లో రష్యా ఇదే తరహాలో క్రిమియా ద్వీప కల్పాన్ని స్వాధీనం చేసుకుంది. దీంతో లుహాన్స్క్, డొనెట్స్క్ ప్రాంతంలో వేర్పాటు భావనలు మరింతగా పెరిగాయి. ఆ ప్రాంతాలు అయితే రష్యాలోనైనా కలవాలని.. లేదంటే స్వతంత్ర్యంగానైనా ఉండాలని కోరుకుంటున్నాయి. ఈ వేర్పాటు వాదనికి రష్యాకు కూడా మద్దతు ఇస్తోంది. ఈ రెండు ప్రాంతాలను స్వతంత్ర్య ప్రాంతాలుగా గుర్తిస్తూ ఫిబ్రవరి 21న రష్యా ఓ ప్రకటన విడుదల చేసింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి