రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరూ కూడా ఎన్నో రోజుల పాటు వాసు దీక్షలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి ఉపవాస దీక్షలు చేస్తున్న సమయంలో ప్రస్తుతం విపరీతమైన కరెంటు కోతలు మాత్రం ముస్లిం సోదరులందరికీ తెగ ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.ఇక ఇదే విషయంపై స్పందించిన తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంటరీ మైనారిటీ కార్య  నిర్వాహక కార్యదర్శి ఎం డి ఆన్సర్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే  ప్రభుత్వం విధిస్తున్న కరెంట్ కోతలకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. కొంతమంది మైనారిటీ నాయకులు ఆధ్వర్యంలో ఆదివారం మసీద్ లో నమాజ్ సమయంలో విసనకర్రలు పంపిణీ చేశారు ఆయన.


 ఇక ఈ సందర్భంగా మాట్లాడిన ఎండీ ఆన్సర్ జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు నమ్మి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తే ఇక ఇప్పుడు జగన్ ను గెలిపించినందుకు ప్రజలందరికీ విసనకర్రలు కొవ్వొత్తుల దిక్కయ్యాయి అంటూ ఎద్దేవా చేశారు. గతంలో ప్రతిపక్షంలో జగన్మోహన్రెడ్డి ఉన్న సమయంలో కరెంటు చార్జీల బాదుడూ అంటు రాగాలు తీశారు. మరి ఇప్పుడు ఆ కరెంటు బాదుడు తో ప్రజలు ఇబ్బంది పడుతున్న సీఎం జగన్కు పట్టడం లేదా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మారిపోతాయి అంటూ చెబితే రాష్ట్ర ప్రజలు నమ్మి వైసీపీకి ఓటు వేశారు. కానీ ఇప్పుడు  కరెంటు చార్జీలు తగ్గించకుండా..  మొత్తం కరెంట్ లేకుండా చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.


 గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు అందరికీ తోఫా అందిస్తే.. ఇక ఇప్పుడు మాత్రం జగన్ మోహన్ రెడ్డి రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు విసనకర్రలు వాడకాన్ని గుర్తు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు ఎండీ ఆన్సర్. ఇప్పటికైనా ముస్లిం సోదరులకు ఇబ్బందులు కలగకుండా ఉండేలా కరెంటు కోతలు తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే కరెంటు ఛార్జీలు కూడా తగ్గించి సామాన్య ప్రజలకు ఉపశమనం కల్పించాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ap