చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఎక్కడ బహిరంగసభ జరిగినా, ఎక్కడ ఏమి మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి తప్పకుండా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తావన కూడా తీసుకొస్తున్నారు. గడచిన రెండు నెలలుగా జగన్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లాల్లో తిరుగుతున్నారు. ఏదోక ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికి 6 జిల్లాల్లో పర్యటించారు. ప్రతిజిల్లాలోను కచ్చితంగా బహిరంగసభ ఏర్పాటుచేసి ప్రభుత్వం చేస్తున్న, చేయబోతున్న కార్యక్రమాలను వివరిస్తున్నారు.





షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి కాబట్టి పనిలోపనిగా ప్రత్యర్ధులపై రాజకీయ విమర్శలు, ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగా సహజంగానే చంద్రబాబునాయుడు మీద జగన్ రెచ్చిపోతున్నారు. చంద్రబాబు మీద జగన్, జగన్ పైన చంద్రబాబు ఆరోపణలు, విమర్శలు చాలా సహజం. అయితే ఇక్కడ ఇంట్రస్టింగ్ పాయింట్ ఏమిటంటే పవన్ పైనకూడా జగన్ తన ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. ఒకపుడైతే పవన్ను నేతగాను, జనసేనను పార్టీగా కూడా గుర్తించటానికి జగన్ ఇష్టపడలేదు. అందుకనే అప్పట్లో జగన్ అసలు పవన్ గురించి పెద్దగా పట్టించుకున్నదే లేదు. 





2019 ఎన్నికల్లోనే జనసేనతో పొత్తు విషయం చర్చకు వచ్చిందట. అపుడు జగన్ మాట్లాడుతు పవన్ను తాను ఒకనేతగాను, జనసేనను రాజకీయపార్టీగాను గుర్తించటంలేదని స్పష్టంగా చెప్పేశారు. పవన్ తో పొత్తుపెట్టుకుంటే నష్టమే తప్ప ఎలాంటి ఉపయోగం లేదని జగన్ అభిప్రాయం. పొత్తులో జనసేనకు కేటాయించే సీట్లవల్ల వైసీపీ నష్టపోతుందనేది జగన్ భావన.





అందుకనే పవన్ అన్నా, జనసేన అన్నా జగన్ అసలు లెక్కేచేయరు. అలాంటిది ఇపుడు పవన్ గురించి కూడా పదే పదే ఎందుకు మాట్లాడుతున్నారు ? ఎందుకంటే పవన్ విషయంపై  జగన్ వైఖరిలో మార్పొచ్చినట్లే అనుకోవాలి. పవన్ను నేతగాను, జనసేనను పార్టీగాను జగన్ గుర్తిస్తున్నట్లున్నారు. పవన్, జనసేన విషయంలో ఒకపుడున్న వైఖరే ఇపుడు కూడా ఉండుంటే జగన్ అసలు దత్తపుత్రుడంటు పదే పదే ప్రస్తావించేవారే కాదు. మొత్తానికి పవన్ విషయంలో జగన్ వైఖరి మారిందనేందుకు ఇదే నిదర్శనం.

మరింత సమాచారం తెలుసుకోండి: