
కాగా, ఉద్యోగాల్లో చేరిన వారిని అప్రెంటిషిపులుగా పేర్కొంటూ రూ.15,000ల జీతాల తో 2 సంవత్సరాలుగా పనిచేయించుకుంది. ఆ తర్వాత డిపార్ట్‌మెంటల్ పరీక్ష పాసయితేనే పర్మినెంట్ చేస్తామనే షరతు పెట్టింది.. ఆ పరీక్షలు జాబ్ లో ప్రమోషన్స్ కోసం రాస్త్రారు.. సాధారణంగా డిపార్ట్‌మెంటల్ టెస్టులు అందుకు నిర్వహిస్తారు. దీనిని ఎప్పటినుంచో కమిషన్ అనుసరిస్తోంది కూడా. ఐతే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయం తో జగన్ ప్రభుత్వం అందుకు భిన్నంగా ప్రవర్తిస్తోంది. ప్రొబేషన్ ప్రకటించడాని కి డిపార్ట్‌మెంటల్ టెస్టును నిర్వహించడమనేది అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.. అసలు ఉద్యోగం ఉంటుందా అని చాలా మంది సందిగ్దంలో పడ్డారు..
మహిళా ఉద్యోగులు మెటర్నిటీ లీవ్ తీసుకున్నా, ఇతర అనారోగ్యకారణాలతో విధులకు హజరవ్వక పోయినా.. అటువంటి వారినందరి నీ పక్కన పెట్టేశారు. ఇలా ఫిల్టర్ చేయగా దాదాపు 60,000 ల మందికి పైగా సచివాలయ ఉద్యోగుల కు పర్మినెంట్ చేయకుండా నోటీసులు జారీ చేశారు. తమను పర్మినెంట్ చేయాలని డిమాండ్‌లు పెరగడం తో ప్రభుత్వం తమ పట్ల కఠినంగా వ్యవహరిస్తోందని పలువురు వాపోతున్నారు.. ఇప్పటికే ఆశలు లేని కొందరు జాబ్ ను పక్కన పెట్టి ఉద్యొగాలను మానెయ్యాలనే ఆలోచనలో వున్నట్లు తెలుస్తుంది.మరీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటుందో చూడాలి..