తెలుగు రాష్ట్రాల్లో వర్మ పేరు తెలియని వాళ్ళు ఉండరు.. ఒకపుడు చేతి నిండా సినిమాలతో బాగా బిజిగా ఉండే వర్మ ఇప్పుడు విమర్శలకు కెరాఫ్ గా నిలుస్తున్నాడు. ఏదైనా ఒత్తి ఉంటేనె అంతా సవ్యంగా ఉంటుంది.. లేకుంటే చీకటి మిగులుతుంది.. అప్పుడు ధీమాతో సినిమాలను తగ్గించాలని అనుకున్నాడు.. ఇప్పుడు సినిమాలే లేకుండా పోయాయి.. బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలను అందించిన వర్మ ఇప్పుడు వివాదాల వర్మగా మారిపోయాడు.. ఆయన సినిమాలు కూడా అంతే.. ఎప్పుడూ వార్తల్లో నిలిచే వర్మ ఇప్పుడు మరోసారి లేని పోనీ చిక్కులను తెచ్చుకున్నాడు..


ఎన్డీయే పక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముపై ఆయన తన సోషల్ మీడియా ద్వారా స్పందించాడు.. RGV వ్యాఖ్యలు కించ పరిచేలా ఉన్నాయని… ఆర్జీవీ పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు.ఆదివాసీ మహిళ రాష్ట్రపతి అవుతున్న సందర్భంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ పై పోలీసుశాఖ వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. రాష్ట్రపతి అభ్యర్ధి పేరును సెటైరికల్‌గా వాడటం అంటే రామ్ గోపాల్ వర్మ తన పరిధికి మించి వ్యవహరించడమే అని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు...


గురువారం రామ్‌గోపాల్ వర్మ తన ట్విట్టర్‌లో ఇలా రాశారు. '' ద్రౌపదీ ముర్ము ప్రెసిడెంట్ ఐతే పాండవులు ఎవరు..? మరీ ముఖ్యంగా కౌరవులు ఎవరు ? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలను పోస్ట్ చేశారు.. వర్మ అడుగు జాడల్లో ఎవరూ వెళ్ళకుండా ఉండాలంటే వర్మని జైలుకి పంపాలని ఆయన అన్నారు. రాంగోపాల్‌ వర్మని మానసిక వైద్యుడి చూపించాల్సిన అవసరం ఏర్పడిందని వీర్రాజు అన్నారు. వాక్ స్వాతంత్ర్య హద్దును కూడా దాటి ప్రవర్తించిన రామ్ గోపాల్ వర్మ పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.. ప్రస్తుతం ఇది సంచలనంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: