సముద్ర గర్భంలో ఎన్నో రకాల జీవులు ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కానీ అందులో మనకు తెలిసినవి కొన్ని మాత్రమే.  ఇక ఎప్పుడైనా సముద్రగర్భంలో ఏవైనా కొత్త జీవులు కనిపించాయి అంటే చాలు అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో పెట్టడం ఇక ఆ కొత్త రకమైన జీవుల గురించి పరిశోధనలు జరపడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా వింత ఆకారం లో ఉన్న జీవులు ఏవైనా బయట పడితే అవి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయ్ అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ఇలాంటివి చూసిన తర్వాత అటు సముద్ర గర్భం అంతుచిక్కని జీవరాశులకు ఆలవాలం అన్నది నిజమే అని అనిపిస్తూ ఉంటుంది.


 ఇటీవల శాస్త్రవేత్తలు మరో వింతైన జీవిని కనుగొన్నారు. ఆ వింత జీవి ని చూసి ప్రతి ఒక్కరూ అవాక్కవుతున్నారు అనే చెప్పాలి. ఇక ఈ వింత జీవి పేరు ప్లాట్ వార్మ్. భారతదేశం తూర్పు తీరంలో ఉండే ఈ జీవి విశాఖలో తొలిసారిగా  జీవి కనిపించడం గమనార్హం. ఈ జీవి ఆకారం చూసిన తర్వాత ఇది నిజంగా ప్రాణాలతో ఉన్న ఒక వింత జీవి అని ప్రతి ఒక్కరికి అనుమానం కలుగుతూ ఉంటుంది.. ఎందుకంటే చెట్టునుంచి రాలిన ఒక ఆకు లాగా కనిపిస్తూ ఉంది ఈ జీవి. రక్తనాళాలు లేని ఈ జీవి లేత ముదురు నీలం రంగు మధ్యలో పొడవైన పసుపు రంగు వెన్నుతో అందరిని ఆశ్చర్యపరుస్తుంది అని చెప్పాలి.


 అయితే సాధారణంగా సముద్రతీరంలో ఆటుపోట్లు సంభవించిన సమయంలో ఇలాంటి జీవులు కనిపించడం జరుగుతూ ఉంటుందట. ఇక ఇవి సముద్రగర్భంలో కొన్ని అరుదైన జాతులకు సంబంధించిన జీవులు అని శాస్త్రవేత్తలు చెబుతుండడం గమనార్హం. అయితే గత కొంత కాలం నుంచి కూడా ఈస్ట్ కోస్ట్ కన్జర్వేషన్ టీం ఆంధ్రప్రదేశ్ తీరంలో రెండు వారాలకు ఒకసారి మైరాన్ వాక్ చేపడుతున్నారు. ఎవరికైనా ఆసక్తి ఉంటే ప్రజలు కూడా వచ్చి పాల్గొనేందుకు అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఇలాంటి వాక్ చేపడుతున్న సమయంలో 3 సెంటీ మీటర్ల పొడవున్న ఫ్లాట్ వార్మ్ అనే వింత జీవి ని కనుగొన్నారు.  ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: