ఆంధ్రప్రదేశ్ లో జగన్ నాయకత్వంలో ప్రభుత్వం పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళుతోంది. మొదటి నుండి కూడా జగన్ అనుభవలేమితో చిన్న చిన్న పొరపాట్లను చేస్తూ వస్తున్నారు. అయితే ప్రతిపక్షము బలంగా లేకపోవడం మూలాన సేఫ్ అవుతూ వచ్చాడు. కానీ గత కొద్ది రోజులుగా మూడు రాజధానులు మరియు ఢిల్లీ లిక్కర్ స్కాం గురించి ఎంత రభస జరుగుతోందో తెలిసిందే . అయితే ఈ రెండు విషయాల గురించి ప్రతిపక్షాలకు అడ్డుకట్ట వేయడానికి తమ దగ్గర సరైన మార్గాలు కనిపించడం లేదు. ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తున్న తరుణంలో జగన్ అండ్ టీం మరో అద్భుతమైన పథకంతో అందరినీ డైవర్ట్ చేసింది.

విజయవాడలో మొన్నటి వరకు ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ని కాస్త అసెంబ్లీ సాక్షిగా ఒక శాసనం పేరుతో వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ గా మార్చారు . అయితే శాసనసభలో వైసీపీ కి అధిక బలం ఉండడంతో బిల్ పాస్ అయిపోయింది. దీనిని అడ్డుకోలేని ప్రతిపక్షాలు విమర్శలు చేయడం మొదలు పెట్టారు. మొత్తం రాష్ట్రము అంతా కూడా ఇదే విషయం పైన చర్చలు జరుగుతున్నాయి. అయితే బయట వినిపిస్తున్న టాక్ ప్రకారం జగన్ అండ్ టీం వేసిన అద్భుతమైన ప్లాన్ గా ఇది తెలుస్తోంది. అమరావతి సమస్య మరియు ఢిల్లీ లిక్కర్ స్కాం లాంటి వాటి నుండి ప్రతిపక్షాలను డైవర్ట్ చేయడానికి హెల్త్ యూనివర్సిటీ ని అడ్డుగా పెట్టుకున్నారని భోగట్టా.

అయితే జగన్ అమరావతి మరియు లిక్కర్ స్కాం లు వలన ఎక్కువ సమస్యలు అని దీన్ని ప్రయోగించి ఉంటే... ఈ సమస్య ఇంకెన్ని అవాంతరాలు కలిగిస్తుంది అనేది కూడా జగన్ గమనించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రహస్యం తెలిసిన వారు... అంతా జగన్ సార్ ఖతర్నాక్ ప్లాన్ వేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: