జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వ్యవహారం ఒకపట్టాన ఎవరికీ అర్ధంకాదు. పవన్ మాటలు విన్నవాళ్ళకి అతనిలో అపరిచితుడు ఉన్నాడా అనే అనామనం పెరిగిపోతోంది. గాంధిజయంతి, లాల్ బహద్దూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని మచిలీపట్నంలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతు  తనకు జగన్మోహన్ రెడ్డి అంటే వ్యక్తిగతంగా విభేదం ఏమీ లేదన్నారు. అయితే జగన్ మాత్ర తనతో విభేదించే వాళ్ళతో వ్యక్తిగత కక్షతో ఉన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.





జగన్తో కానీ మంత్రులు, వైసీపీ నేతల్లో ఎవరితోను తనక వ్యక్తిగతంగా గొడవలు లేవన్నారు. పాలనలోని లోపాలను మాత్రమే తాను ఎత్తిచూపుతున్నట్లు పవన్ చెప్పారు. అంతేకానీ జగన్ను తిట్టాలని, కించపరచాలని, ఎదురుతిరగాలని తనకు ఎప్పుడూ లేదన్నారు. ఈ మాటలు అంతా విన్నతర్వాత అసలు జగన్ విషయంలో పవన్ తన వైఖరిపై ఎందుకని వివరణ ఇచ్చుకున్నారో అర్ధంకావటంలేదు. జగన్ అంటే పవన్ కు ఒళ్ళంతా మంటన్న విషయం అందరికీ తెలిసిందే.





జగన్ అంటేనే పవన్ బాగా ధ్వేషం పెంచుకున్నారు. ఆ ధ్వేషంతోనే 24 గంటలూ, 365 రోజులూ విషయం కక్కుతుంటారని ప్రతి ఒక్కళ్ళకి తెలిసిందే. జగన్ అంటేనే పవన్లో సుపీరియారిటి కాంప్లెక్సుతో కూడిన ఇన్పీరియారిటి కాంప్లెక్స్ పేరుకుపోయిందని అందరికీ అర్ధమైపోతోంది. తిట్టాల్సిందంతా జగన్ను తిట్టేస్తు తనకు జగన్ అంటే వ్యక్తిగత ఎలాంటి విభేదం లేదని అంటే ఎవరైనా నమ్ముతారా ?





రెండుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఎంఎల్ఏగా జగన్ గెలిచిన విషయం తెలిసిందే. అలాగే అలాగే పాల్గొన్న మొదటి సార్వత్రిక ఎన్నికలోనే 67 సీట్ల గెలిచి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఐదేళ్ళు పనిచేశారు. తర్వాత 2019లో 151 సీట్ల అఖండ విజయంతో ముఖ్యమంత్రయ్యారు. ఇదే సమయంలో పవన్ పోటీచేసిన మొదటి ఎన్నికలోనే బోల్తాపడ్డారు. పార్టీ మొత్తంమీద గెలిచింది ఒకే ఒక్క ఎంఎల్ఏ. ఇక పవన్ అయితే రెండుచోట్లా ఓడిపోయారు. దాంతో జగన్ అంటేనే పవన్లో నిలువెత్తు ఈర్ష్యతో కూడిన ధ్వేషం పేరుకుపోయిందన్నది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: