రాబోయే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్లమెంటుకు పోటీచేస్తారా ? కాపు వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. వచ్చేఎన్నికల్లో పవన్ రెండు నియోజకవర్గాల నుండి పోటీచేస్తారనే ప్రచారం జరగుతున్న విషయం అందరికీ తెలిసిందే. పోయిన ఎన్నికల్లో పోటీచేసినట్లే పవన్ రెండు నియోజకవర్గాల్లో పోటీచేస్తారని పార్టీ నేతలు కూడా  గట్టిగానే చెబుతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ పోటీచేయాలని అనుకుంటున్నది రెండు నియోజకవర్గాల నుండి  అన్నది కరెక్టేనట.





అయితే రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం కాదట. ఒకటేమో అసెంబ్లీ నియోజకవర్గం రెండోదేమో పార్లమెంటు నియోజకవర్గమట.  పోయిన ఎన్నికల్లో భీమవరం, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీచేసి ఓడిపోయిన విషయం తెలిసిందే.  పార్టీవర్గాల సమాచారం ప్రకారం రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీకి మళ్ళీ భీమవరం నుండే పోటీచేస్తారట. లోక్ సభకు మాత్రం రెండు నియోజకవర్గాలు కాకినాడ / అనకాపల్లిని  పరిశీలిస్తున్నారట. ఇపుడు పవన్ సోదరుడు నాగబాబు అనకాపల్లికి పోటీచేస్తారనే ప్రచారం విపరీతంగా జరుగుతోంది.





అయితే నాగబాబు చేస్తున్న సమీక్షలు, అసెంబ్లీ నియోజకవర్గాల  పర్యటలన్నీ గ్రౌండ్ లెవల్లో పార్టీకి ఉన్న సానుకూలత గురించి తెలుసుకునేందుకు మాత్రమే అంటున్నారు. పరిస్ధితులు సానుకూలంగా ఉన్నాయని, గెలుపు ఖాయమని నమ్మకం కుదిరితే అప్పుడు పవనే అభ్యర్ధిగా దిగొచ్చనేది ఇన్ సైడ్ టాక్. అలాగే కాకినాడ నియోజకవర్గం మీద కూడా పవన్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఆమధ్య రెండురోజుల పాటు కాకినాడలోనే పవన్ క్యాంపు వేసి కాకినాడ సిటీలోని సామాజికవర్గాలు, చుట్టుపక్కల నియోజకవర్గాల్లోని సామాజికవర్గాలు వాళ్ళ స్థితిగతులపై ప్రత్యేకంగా మాట్లాడి ఫీడ్ బ్యాక్ తీసుకున్న విషయం గుర్తుండే ఉంటుంది.





అనకాపల్లి, కాకినాడలో ఎక్కడ పోటీచేస్తే గెలుపు గ్యారెంటీ అని ఫీడ్ బ్యాక్ వస్తుందో అక్కడి నుండే పోటీచేస్తారట. ఎంపీగా ఎందుకు పోటీచేయచ్చంటే బీజేపీ పెద్దల సూచన ప్రకారమే అంటున్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే ఒక పద్దతి ఒకవేళ వైసీపీనే మళ్ళీ అధికారంలోకి వస్తే అప్పుడు ఎంఎల్ఏగా రాజీనామా చేసి ఎంపీగా కేంద్రప్రభుత్వంలోకి వచ్చేయచ్చని బీజేపీ పెద్దలు చెప్పారట. అందుకనే ఎంఎల్ఏ, ఎంపీగా పోటీచేసే విషయమై పవన్ సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. చివరకు ఏమవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: