తిరుపతి: కూటమిలో భాగంగా టిడిపి జనసేన బిజెపి పార్టీ పొత్తు పెట్టుకుని మరి సీట్లను అయితే ప్రకటిస్తూ ఉన్నాయి.. అయితే అభ్యర్థుల విషయంలో మాత్రం ఎక్కడ చూసినా అసంతృప్తి జ్వాలలు చెలరేగుతూనే ఉన్నాయి.. ముఖ్యంగా అసెంబ్లీ, ఎంపీ టికెట్ల ఆశించి దక్కకపోవడంతో సీనియర్ నేతలు పలువురు జనసేన నాయకులు సైతం చాలా ఆందోళన తెలియజేస్తున్నారు. తాజాగా తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని కూడా జనసేనకు కేటాయించడంతో అటు టిడిపి పార్టీ లో అసమతి సెగలు రాసుకున్నట్టు తెలుస్తోంది.. తిరుపతిలో జనసేన పార్టీ నుంచి ఆరని శ్రీనివాసులు టికెట్ ఇచ్చారు.


అయితే అక్కడ టిడిపి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ చాలా అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. టికెట్ దక్కకపోవడంతో మీడియా ముందుకు వచ్చి మరి ఎమోషనల్ గా మాట్లాడారు.. టిడిపి కోసం ఎన్నో ఏళ్లుగా అహర్నిశలు కష్టపడుతూనే ఉన్నానని.. తిరుపతి అసెంబ్లీ స్థానం దక్కకపోవడం చాలా బాధాకరమంటూ కూడా వెల్లడించింది.. తిరుపతి సీటును జనసేనకు కేటాయించడం పైన మరొక సారి ఆలోచించాలంటూ కూడా ఆమె సూచించింది.. చంద్రబాబు గారు చేసిన సర్వేలన్నీ కూడా ఏమయ్యాయి అంటూ ఆమె ప్రశ్నిస్తోంది?. ఎవరికో మద్దతు పలకమంటే త క్యాడర్ అసలు అంగీకరించని కూడా వెల్లడించింది.


తిరుపతి టికెట్ పైన అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పైన మరొక సారి చర్చించుకుని తెలపాలంటూ సుగుణమ్మ తెలియజేశారు.. ఈ విషయం పైన తాను కూడా ఆలోచిస్తారని నమ్ముతున్నాను అన్నట్టుగా మాట్లాడింది.. అటు టిడిపి జనసేన ప్రధాన నేతలు కూడా అసెంబ్లీ సీట్ల వైపు కాస్త ఆలోచించాలని చాలామంది నేతలు కూడా సూచిస్తున్నారు.. కేవలం పార్టీలో చేరిన వారికి టికెట్ కేటాయిస్తే జనం మాత్రం అంగీకరించారని.. దీనివల్ల చాలామంది స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేసే ఆలోచనలు ఉంటారని కార్యకర్తలు సైతం వాపోతున్నారు.. మరి తిరుపతి టికెట్ పైన మరొకసారి చంద్రబాబు జనసేన పార్టీలో ఆలోచించి ఎవరికి టికెట్ ఇస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: