గత సంవత్సరం కర్నాటక ఎన్నికల్లో సిద్ధరామయ్య ఎమోషనల్ వ్యూహానికి పదును పెట్టారు. తనకు ఓటేయాలని ఇదే చివరి అవకాశం అని ఆయన విన్నవించుకున్నారు. అలా ప్రజలని విన్నవించుకోబట్టే ఆయన ఈ రోజు అక్కడ సీఎం గా ఉన్నారు. ఇక చంద్రబాబు కూడా ఈసారి సీఎం అవ్వాలంటే ఆ మాట అనాల్సిన అవసరం ఉందని సమయం వచ్చేసిందని అంటున్నారు.రాజకీయాల్లో చాలా వ్యూహాలు ఉంటాయి. వాటిని సమయం సందర్భం వచ్చినపుడు వాడేయాల్సిందే అంటున్నారు. చంద్రబాబు నాయుడు రెండేళ్ల క్రితం జనంలో తిరుగుతూ తనకు ఇవే ఆఖరి ఎన్నికలు అని చెప్పేశారు. అయితే దాన్ని అప్పట్లో వైసీపీ నెగిటివ్ గా ప్రచారం చేయడంతో పాటు టీడీపీ పని అయిపోయింది అని కూడా ర్యాగింగ్ చేయడంతో చంద్రబాబు తన మాట మార్చేశారు.అయితే పరిస్థితికి అది ఓకే అనుకున్నా కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి వేరు. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ గతంతో పోలిస్తే వీక్ అయ్యింది. సోషల్ మీడియా ప్రభావం వల్ల వైసీపీ పై నెగటివిటీ పెరిగింది.


గెలవడం ఓడిపోవడం పక్కన పెడితే ఈ ఎన్నికలు మాత్రం బాబుకి మంచి అవకాశం అనే చెప్పాలి. తనకు చివరి అవకాశం ఇవ్వాలని కోరితే మాత్రం ఓటర్లు టర్న్ అవుతారు అని  అంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలోని ఓటర్లను టర్న్ చేయాలంటే బలమైన ఎమోషనల్ టచ్ ఉండాలని అంటున్నారు.ప్రస్తుతం చంద్రబాబు వయసు డెబ్బై అయిదేళ్ళు. ఆయనకు ఒక చాన్స్ ఇస్తే ఎనభై ఏళ్ళకు చేరువ అవుతారు. అదే జగన్ వయసు 52 ఏళ్లు. ఆయనకు ఈ చాన్స్ కాకపోయినా మరో చాన్స్ కి ఏజ్ ఉంది అని ఓటర్లు భావించే అవకాశం ఉంటుందని అంటున్నారు. మరి బాబు ఎన్నికల ప్రచారం చివరలో అయినా తనకు ఇదే లాస్ట్ చాన్స్ అని ఎమోషనల్ ఫీల్ తో అడిగితే ఏపీ పాలిటిక్స్ లో కీలకంగా సంచలంగా మారుతుంది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి   మన తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర బాబు నాయుడు ఆ మాట అంటే ఈసారి ఓట్లు రాలడం పక్కా అని తెలుస్తుంది. అయితే చంద్రబాబు అలా అన్నా ఆ కార్డు తీసినా వైసీపీ రియాక్షన్ ఎలా ఉంటుందో టీడీపీలో ఎలాంటి స్పందనలు వస్తాయో కూడా చూడాలని అంటున్నారు. మరి చూడాలి ఈసారి ఏ పార్టీ గెలుస్తుందో.. ఏ పార్టీ ఓడిపోతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: