ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా ఎన్నికల హడావిడి కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. మరి పార్లమెంటు ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలా అని ఓటర్లు.. ఇక తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని దక్కించుకున్నాం. ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లోను దూసుకుపోవాలని కాంగ్రెస్ పార్టీ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పార్లమెంటు ఎన్నికల్లో పట్టు నిలుపుకోవాలని అధికారాన్ని కోల్పోయిన టిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం పావులు కదుపుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.


 అయితే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎప్పటిలాగానే అన్ని పార్టీలకు సీట్లు ఎవరికి కేటాయించాలి అనే విషయంపై కొన్నిచోట్ల తలనొప్పులు తప్పడం లేదు. ఎందుకంటే ఎన్నికలు వచ్చాయంటే ఇక చాలు మాకు సీటు దక్కుతుందంటే మాకు సీటు దక్కుతుందని.. ఇక పార్టీలో ఉన్న నాయకులు అందరూ కూడా తెగ పోటీ పడుతూ ఉంటారు. కానీ ఇక అధిష్టానం కన్ను ఎవరిపై పడుతుంది అన్నది మాత్రం ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంటుంది. అయితే ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు 9 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల వివరాలను ప్రకటించింది.


 ఇక మిగతా స్థానాలలో ఎవరిని అభ్యర్థులుగా ప్రకటిస్తారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ కన్ను ఓ సీనియర్ నేతపై పడినట్లు తెలుస్తోంది. అతను ఎవరో కాదు ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న జీవన్ రెడ్డి. ఆయనను కరీంనగర్ లోక్సభ స్థానంలో బరిలోకి దింపాలని ముందుగా అనుకున్నారు. కానీ ఇక జీవన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన జగిత్యాల.. పక్కనే ఉన్న కోరుట్ల నియోజకవర్గం అంతర్భాగమై ఉన్న నిజాంబాద్ లోక్ సభ స్థానంలో పోటీకి దింపితే విజయం ఖాయమని ప్రస్తుతం రేవంత్ అనుకుంటున్నాడట. తొలుత కరీంనగర్ లోనే పోటీ చేయాలని జీవన్ రెడ్డి అనుకున్నప్పటికీ ఆ తర్వాత నిజాంబాద్ అయితేనే బాగుంటుందని నిర్ణయించుకున్నారట. దీంతో ఇక సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ పార్లమెంటు స్థానం కోసం  సీనియర్ నేత జీవన్ రెడ్డికే ఓటు వేయబోతున్నాడు అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: