టిడిపి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూటమిలో భాగంగా ఈసారి ఎన్నికలలో నిలవబోతున్నారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ కు ఇచ్చిన ప్రిఫరెన్స్ జూనియర్ ఎన్టీఆర్ కు ఇవ్వకపోవడంతో అటు టిడిపి కార్యకర్తలు, అభిమానులు సైతం చంద్రబాబు పైన అసహనంతో ఉన్నారు. ఈ విషయాన్ని ఎంతోమంది ఎన్నో సందర్భాలలో కూడా తెలియజేశారు. దీంతో గత కొన్నేళ్లుగా నందమూరి కుటుంబంలో విభేదాలు ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. పైగా ఇప్పుడు  జూనియర్ ఎన్టీఆర్ బలం పైన కూడా ఎక్కువగా చర్చలు వినిపిస్తూ ఉండడం గమనార్హం.


నందమూరి కుటుంబంలో ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే.. కళ్యాణ్ రామ్ కి  కూడా అంతంత మాత్రమే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. వీరిద్దరూ ఒకవైపు.. మిగిలిన వారందరూ మరొకవైపు అన్నట్టుగా ఉంటున్నారు. ఈసారి టిడిపికి ఓటు బ్యాంకు అనేది అత్యంత కీలకంగా మారింది. ఇలాంటి సమయంలో చంద్రబాబు ను ఎన్టీఆర్ పట్టించుకోకపోతే కచ్చితంగా టిడిపి పార్టీకి మైనస్ అవుతుందని ప్రజలు కూడా  ప్రజలు కూడా భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఒక్క మాటతో ఓటు బ్యాంకు పెరిగే అవకాశం కూడా ఉందని పలువురు నేతలు , అభిమానులు , కార్యకర్తలు కూడా తెలియజేస్తున్నారు.


చాలామంది నేతలకు కూడా ఎన్టీఆర్ తో  మంచి సంబంధాలు ఉన్నాయి. టిడిపి పార్టీ కూడా చాలా క్లిష్ట పరిస్థితులలో ఉన్నది.  కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఓటమి భయం అనేది చాలా కనిపిస్తోందనే వాదనలు అటు అభ్యర్థులలో కూడా వినిపిస్తున్నాయి. ఈ సమయంలో చంద్రబాబు నాయుడు అటు నందమూరి కుటుంబాన్ని నారా కుటుంబాన్ని కలుపుకొని ముందుకు వెళితే.. విజయం అందుకోవడం కష్టమేమీ కాదని చెప్పవచ్చు.. కానీ చంద్రబాబు నాయుడు.. ఎన్టీఆర్ను రంగంలోకి దింపితే నారా లోకేష్ ను ఎవరు గుర్తించరనే ఉద్దేశంతో జూనియర్ ఎన్టీఆర్ ని టిడిపి పార్టీకి దూరం పెడుతున్నట్లుగా ఇప్పటికీ అక్కడక్కడ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ లేకపోవడం టిడిపి పార్టీకి మైనస్ గా మారుతోంది. మరి ఈ విషయం పైన ఇప్పుడైనా చంద్రబాబు గుర్తిస్తారా లేదా అనే విషయం చూడాలి. ఒకవేళ చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ని పార్టీ లోకి ఆహ్వానించకపోతే తప్పనిసరిగా ఓటమి చవిచూడక తప్పదు అని కూడా కొంతమంది హెచ్చరిస్తున్నారు. మరి ఈ విషయంపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: