దుకాణం బంద్.. గత కొంతకాలం నుంచి తెలంగాణ రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తున్న మాట. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరికొన్ని రోజుల్లో కేసీఆర్ దుకాణం బంద్ కాబోతుందని.. బిఆర్ఎస్ పార్టీలో సొంత ఫ్యామిలీ నేతలు తప్ప ఇంకా ఎవరు మిగలరు అంటూ విమర్శలు చేస్తుంది. విమర్శలు చేయడమేమ ఇది నిజమే అన్నట్లుగా ఆధారాలు కూడా చూపిస్తుంది. ఎందుకంటే కొంతకాలం నుంచి బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరిగిపోయాయి. ఏకంగా కేసీఆర్కు ఆప్తులు.. వీళ్ళు ఎప్పటికీ బిఆర్ఎస్ ను వీడరు అనుకున్న నేతలు సైతం కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు.


 ఇక మరి కొంతమంది ఎమ్మెల్యేలు హస్తం పార్టీలోకి వెళ్లేందుకు అంతర్గత చర్చలు జరుపుతున్నారు అన్నది తెలుస్తోంది. అయితే ఇటీవలే  మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారిపోయాయి. పార్లమెంట్ ఎన్నికల ముగిసిన తర్వాత 25 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతున్నారు అంటూ ఆయన కామెంట్ చేశాడు. బిఆర్ఎస్ లో చివరికి కెసిఆర్ కుటుంబానికి చెందిన నేతలే మిగులుతారు అంటూ ఉత్తమ్ వ్యాఖ్యానించారు. అయితే మంత్రి హోదాలో ఉండి ఎలాంటి ఆధారాలు లేకుండా ఉత్తం ఇలాంటి వ్యాఖ్యలు చేయరని.. నిజం ఉండే ఉంటుందని అందరూ అనుకుంటున్నారట. ఇక ఇదే జరిగితే ఇక బిఆర్ఎస్ దుకాణం బంద్ చేసుకోవాల్సిందే అనే వాదన కూడా అక్కడక్కడ వినిపిస్తుంది.


 అయితే బిర్ఎస్ పతనానికి  ఇదొక్కటే కారణం కాదు.. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. గతంలో 108 మంది ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ఇప్పుడు 39కి పడిపోవడం కెసిఆర్ ఒంటెద్దు పోకడను తెలియజేస్తుందని ఉత్తమ్ అన్నారు. అయితే ఇది నిజమే అని అనుకుంటున్నారట బిఆర్ఎస్ లోని కొంతమంది ఎమ్మెల్యేలు. పార్టీ విపత్కర పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో  కెసిఆర్ మీద అసంతృప్తితో ఉన్న వేరే దారి లేక కాంగ్రెస్లో చేరుతున్నారట. మరోవైపు ఇక టిఆర్ఎస్ పేరును బిఆర్ఎస్ గా మార్చడం కూడా ఎమ్మెల్యేలకు ఇష్టం లేదట. తెలంగాణ వాదం నుంచి పుట్టిన పార్టీకి ఆ పదాన్ని తొలగించడం అంటే కూర్చున్న కొమ్మని నరుక్కోవడమే అనే వాదన కూడా వినిపించింది. అయితే ఇలా పార్టీ పేరు మార్పే చివరికి పార్టీ ఓటమికి కారణమైందని సొంత పార్టీ నేతలు అనుకుంటున్నారట.


 ఇక బిఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా ఆ పార్టీ పతనానికి  కారణమైందని రాజకీయ విశ్లేషకులు కూడా అనుకుంటున్నారు. ఇలా తిరుగులేని పార్టీగా హవా నడిపించిన బిఆర్ఎస్ ఇక ఇప్పుడు విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఇక రానున్న రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోవడం.. ఉత్తం చెప్పినట్లు బిఆర్ఎస్ పార్టీ నుంచి 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరితే ఇక కేసిఆర్ దుకాణం సర్దుకోవాల్సిందే అని ఆ పార్టీ ఎమ్మెల్యేలే అనుకుంటున్నారట. ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: