ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా కూడా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కనిపిస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని రాష్ట్రాలలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి అన్న విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల వేడి డబుల్ అయింది. అన్ని పార్టీలు గెలుపే  లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయ్. ఎప్పటిలాగానే ఓటర్ మహాశయులను ఆకట్టుకునేందుకు ప్రచారంలో దూసుకుపోతున్నారు అభ్యర్థులు. ఇక తమను గెలిపిస్తే ఏం చేస్తాం అనే విషయంపై హామీల వర్షం కురిపిస్తున్నారు అని చెప్పాలి.


 ఇంకోవైపు అధికారులు ఓటు హక్కు యొక్క ఆవశ్యకత గురించి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పిస్తూ.. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇలాంటి సమయంలో ఇక ఓటర్లకు సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. సాధారణంగా ఒక ఇంట్లో ఎంత మంది ఓటర్లు ఉంటారు అంటే   మహా అయితే ఒక నలుగురు లేదా ఐదుగురు  ఓటర్లు ఉంటారు అని చెబుతారు ఎవరైనా  ఒకవేళ అది ఉమ్మడి కుటుంబం అయితే ఒక 20, 30 ఓట్లు ఒకే కుటుంబంలో ఉండడం కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అలా కాదు ఏకంగా ఒక చిన్నపాటి గ్రామంలో ఉండే ఓట్లు అన్ని ఒకే కుటుంబంలో ఉన్నాయి. ఓకే ఇంట్లో 350 ఓట్లు ఉండడం గమనార్హం. ఏప్రిల్ 19వ తేదీన అస్సాంలో తొలి విడత పోలింగ్ జరగనున్న నేపథ్యంలో  ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. సోనీట్ పూర్ జిల్లా పులో గురి నేపాలి ఫామ్ గ్రామంలో ఒకే ఇంట్లో 350 ఓట్లు ఉన్నాయి. దివంగత బహదూర్ తాప అనే వ్యక్తికి ఐదుగురు భార్యలు. అయితే ఆ భార్యల ద్వారా 12 మంది కొడుకులు, 9 మంది ఆడపిల్లలను ఉన్నారు. కోడళ్ళు, అల్లుళ్ళు, పిల్లలు, మనవళ్లు, ముని మనవళ్లతో కలిపి ఆ ఒక్క కుటుంబంలోనే జనాభా 1200 కు చేరింది. ఇక ఆ కుటుంబంలో ఓటు హక్కు కలిగి ఉన్నవారు 350 మంది ఉన్నారు అన్న విషయం ఇటీవల ఎన్నికల అధికారులు సైతం గుర్తించి షాక్ అయ్యారు. ఇక వీరందరూ కూడా అదే ఊరిలో ఏకంగా 300 ఇళ్లల్లో నివసిస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: