ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కేవలం దురదృష్టానికి మాత్రమే కాదు ఎన్నో చెత్త రికార్డులకు కూడా కేరాఫ్ అడ్రస్ గా కొనసాగుతూ ఉంటుంది. ప్రతిసారి కూడా ఈ సాలా కప్ నందే అనే నినాదంతో బరిలోకి దిగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇక ప్రతిసారి కూడా చెత్త ప్రదర్శనతో అభిమానులను నిరాశ పరుస్తూ ఉంటుంది. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీ లో ఏ ఒక్క సీజన్లో కూడా బెంగళూరు జట్టుకు కప్పు గెలవాలనే కల నెరవేరలేదు. విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్న సమయంలో మాత్రమే కాదు ఇక ఇప్పుడు ఫ్యాబ్ డూప్లెసెస్ సారధిగా కొనసాగుతున్న సమయంలోను ఇక పరిస్థితి ఇలాగే ఉంది. జట్టులోకి ఎంతో మంది స్టార్ ప్లేయర్లను కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి తీసుకున్నప్పటికీ ఆ ప్లేయర్లు ఎందుకో ఆర్సీబీకిలోకి వచ్చేసరికి మాత్రం చెత్త ప్రదర్శన చేస్తూ నిరాశ పరుస్తూ ఉన్నారు. ఇక 2024 ఐపీఎల్ సీజన్లో కూడా ఆర్సిబి ఇలాగే వరుస ఓటమిలతో సతమతమవుతుంది. ఏడు మ్యాచ్ లలో కేవలం ఒకే ఒక విజయాన్ని మాత్రమే సాధించిన ఈ టీం.. పాయింట్లు పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతుంది. దీంతో కనీసం ప్లే ఆఫ్ లో కూడా అడుగుపెట్టడం కష్టంగానే మారిపోయింది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఇటీవల సన్రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయిన ఆర్ సి బి ఒక చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఐపిఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న జట్టుగా అత్యల్ప స్కోర్ చేసిన టీమ్ గా నిలిచింది. ఇటీవల సన్రైజర్స్ తో జరిగిన మ్యాచ్లో 287 పరుగులు సమర్పించుకుంది ఆర్సిబీ. ఇదే ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక స్కోరు   మరోవైపు 2017 ఐపిఎల్ సీజన్లో కోల్కతా పై ఆర్సిబి 49 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఇక ఐపీఎల్ హిస్టరీలో ఇది అత్యల్ప స్కోర్.. దీంతో రెండు చెత్త రికార్డులు ఆర్సిబి పేరిటే ఉన్నాయి. అయితే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో లాగానే ఈసారి ఐపీఎల్లో కూడా ఆర్సిబి జట్టు టైటిల్ గెలుస్తుందని అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నప్పటికీ ఆ జట్టు ఆట తీరు అందరి ఆశలపై నీళ్లు చల్లుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl