ఏపీలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో చాలామంది నేతలు కూడా నామినేషన్లు వేస్తూ ఉన్నారు.. ఇలాంటి తరుణంలో జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఒక మహిళ అభ్యర్థి ఆస్తిపాస్తులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఆమె ఎవరో కాదు నెల్లిమర్ల టికెట్ దక్కించుకున్న లోకం మాధవి. కూటమిలో భాగంగా ఈమెకు టికెట్టు ఇవ్వడంతో ఒక్కసారిగా ఈమె పేరు బయటికి రావడం జరిగింది. అయితే నామినేషన్ వేసిన సమయంలో ఈమె ఆస్తిపాస్తులు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.విజయనగరం జిల్లా నెల్లిమర్ల జనసేన పార్టీ అభ్యర్థి లోకం మాధవి.. ఈమె గురించి పూర్తిగా చెప్పాలి అంటే చాలామంది నేతల ఆస్తులను మించి ఉండడం గమనార్హం... ఈమె ఆస్తులు 900 కోట్లుగా చూపించడంతో ప్రస్తుతం లోకం మాధవి పేరు వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా లోకం మాధవి ఉన్నత విద్యావంతురాలు విదేశాలలో కూడా ఉద్యోగం చేస్తూనే తన భర్త ప్రసాద్ తో కలిపి ఒక మిరాకిల్ సాఫ్ట్వేర్ అనే కంపెనీని కూడా స్థాపించారు. వీరి కుటుంబం మొత్తం అమెరికాలో ఉన్నట్లు తెలుస్తోంది.


ఈ కంపెనీలు  ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నట్లు సమాచారం.ఇలా తన కంపెనీలతో బాగానే సంపాదించింది లోకం మాధవి.. అయితే ఆమె ఆఫిడవిట్లో పేర్కొన్న ఆస్తులను చూసి అందరూ ఈమెను అసమాన్యురాలు అని అనుకుంటున్నారు. ఆంధ్రాలో టిడిపి వైసిపిలో కోటీశ్వరులు ఉన్నారు. కానీ వారందరికీ మించి మరి ఆస్తులు కలిగిన నేతగా అందులో ముఖ్యంగా మహిళ నేతగా లోకం మాధవి ఈ రేంజ్ ను చూసి పలువురు నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు. అయితే వైసిపి నేతలు మాత్రం ఈమె ఎన్ఆర్ఐ అంటూ తెలియజేస్తున్నారు. అక్కడ  వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బండుకొండ అప్పలనాయుడు ప్రచారంలో భాగంగా తనను గెలిపిస్తే అందరికీ అందుబాటులో ఉంటానని  చెబుతున్నప్పటికీ.. ఈమె ఆస్తులను చూసిన తర్వాత ఇక్కడ వైసిపి నేతకు దీటైన అభ్యర్థి అంటూ పలువురు నేతలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: