తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలలో విజయం సాధించి అధికారాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని భావిస్తుంది. ఈ క్రమంలోనే గత ప్రభుత్వ తప్పిదాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుంది. అదే సమయంలో కాంగ్రెస్ ను గెలిపిస్తే ఏం చేస్తాము అనే విషయంపై స్పష్టమైన హామీలను కూడా ఇస్తున్నారు అని చెప్పాలీ.


 ఇక ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన పూర్తి కాగా.. ప్రచార రంగంలో దూసుకుపోతుంది కాంగ్రెస్ పార్టీ. అయితే తెలంగాణ తెలుగుదేశం పార్టీ అటు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలక పోతుందా అంటే మాత్రం అవును అని సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆ పార్టీకి మంచి ఓటు బ్యాంకు ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి టిడిపి మద్దతుపై ఆ పార్టీ అధిష్టానం ఇక స్పష్టత ఇవ్వకపోయినప్పటికీ లోలోపల మాత్రం కాంగ్రెస్ వైఫై టిడిపి అన్న ప్రచారం జరుగుతుంది.


 చేవెళ్ల సికింద్రాబాద్ మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లలో ఇక గెలుపు ఓటములను నిర్ణయించే స్థాయిలో కూడా టిడిపి క్యాడర్ ఉంది అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆ పార్టీ ఎవరికి మద్దతు పలకబోతుంది అనేది హాట్ టాపిక్ మారిపోయింది. అయితే ప్రస్తుతం తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది టిడిపి. అయితే ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో టిడిపి కాంగ్రెస్కు మద్దతు ప్రకటించిన.. ప్రత్యక్ష ఎన్నికల్లో లేకపోవడం మాత్రం ఆ పార్టీకి పెద్ద మైనస్ లాంటిదే అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి టిడిపి మద్దతు ఇస్తుందని ప్రచారం జరుగుతున్న.. ఆ పార్టీ నుంచి అధికారిక ప్రకటన రావడం ఆ పార్టీకి మైనస్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు చంద్రబాబు, రేవంత్ చీకటి ఒప్పందం ఉంది అందుకే కేసీఆర్ చేసిన వాక్యాలతో ఇంకా ఈ విషయం మరింత హాట్ టాపిక్ మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: