ఏపీలో ఎన్నికలకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉండగా సీమలో వార్ వన్ సైడ్ గా మారుతోంది. సీమలో ఎన్నికలు జరగడానికి ముందే వైసీపీ కూటమిని చిత్తుచిత్తుగా ఓడించేసిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జగన్ కూటమి సీటి చింపేశాడని పొలిటికల్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. రాయలసీమలో ఏ జిల్లా చూసినా వైసీపీ వేవ్ కనిపిస్తోంది. ఉమ్మడి కర్నూలు, ఉమ్మడి కడప జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసే పరిస్థితులు ఉన్నాయి.
 
హిందూపురం, కుప్పం మినహా కూటమికి ఎక్కడా అనుకూల పరిస్థితులు లేవని నగరిలో మరోమారు రోజా సత్తా చాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రాయలసీమ ప్రజలు మరోమారు జై జగన్ అంటున్నారని 2019 ఫలితాలే రాయలసీమలోని జిల్లాల్లో రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
కూటమి నేతలు ఎంత కష్టపడినా ఆ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ రాయలసీమలో ఏ నియోజకవర్గానికి వెళ్లినా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ రెస్పాన్స్ ఇప్పుడు ఓట్ల రూపంలో కనిపించనుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
రాయలసీమలో వైసీపీ ఏ స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. సీమలో వైసీపీ 50 స్థానాల్లో విజయం సాధిస్తుందని సర్వేలు చెబుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. సీమలో కనీసం 45 స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తే మాత్రం మిగతా నియోజకవర్గాల్లో సులువుగానే విజయాన్ని సొంతం చేసుకుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కూటమి నేతలకు సీమలో కన్నీళ్లు తప్పవని తెలుస్తోంది. టీవీ9, ఎన్టీవీ లాంటి ప్రముఖ టీవీ ఛానెళ్లు ఓటర్లతో మాట్లాడే సమయంలో కూడా చాలామంది ఓటర్లు వైసీపీకే తమ ఓటు అని ఇందులో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదని చెబుతుండటం గమనార్హం.




మరింత సమాచారం తెలుసుకోండి: