ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి.. ఎన్నడూ లేనంతగా యువత ఈసారి భారీగా పోలింగ్ లో పాల్గొన్నారు. దూర ప్రాంతాలలో వున్నా  కూడా ఈ సారి ఆంధ్రా కు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.. ఈ సారి ఆంధ్రప్రదేశ్  ప్రజలు  ఎవ్వరు ఊహించని విధంగా తీర్పును ఇవ్వబోతున్నారు. రాష్ట్రంలో మే 13 న పోలింగ్ ప్రశాంతంగా జరిగింది..అప్పటి నుంచి రాష్ట్రంలో నరాలు తెగే ఉత్కంఠత నెలకొంది.. ఈ సారి ఎవరు అధికారంలోకి వస్తారు అని ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగిన వైసీపీ వస్తుందా లేక టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఈ సారి తిరుగులేని విజయం సాధిస్తుందా అని బెట్టింగ్ రాయుళ్ళు జోరుగా పందెలు కాస్తున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ నేత జగన్ వైపే ఆంధ్రప్రదేశ్ ప్రజల మద్దతు ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆయన క్రేజ్ రాష్ట్రంలో బాగా సాగుతుంది. 

రాష్ట్రంలో గత ఎన్నికలలో ఏకంగా 151 సీట్లు సాధించి  సంచలన సృష్టించిన జగన్ గడిచిన గత ఐదేళ్లలో ప్రజలకు బాగా చేరువయ్యారు. రాష్ట్రంలో ఎలాంటి ప్రతిపక్షం ఎదుర్కొనలేనంతగా పార్టీని బలోపేతం చేసుకున్నారు.. ఎన్నో సంక్షేమ పధకాలను నేరుగా ప్రజలకు చేరువ చేసారు.మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలను 99 శాతం పూర్తి చేసి రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచి జరిగితేనే ఓటు వేయండని జగన్ ఎన్నికల ప్రచారంలో చెప్పుకొచ్చారు. జగన్ ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాల వారు, మహిళలు, దివ్యాంగులకు ఎంతో మేలు జరిగింది. ఎలాంటి అవినీతి లేకుండా సంక్షేమ పధకాలను అందించిన జగన్ ప్రభుత్వం మరోసారి రావాలని యువత కూడా ఈ సారి మరింత ఉత్సాహంతో ఓటు హక్కును వినియోగించుకున్నారు.. దీనితో ప్రస్తుతం రాష్ట్రంలో జగన్ కు క్రేజ్ విపరీతంగా వుంది.జూన్ 4 న వైసీపీ పార్టీ అఖండ విజయం సాధిస్తుందని ఇప్పటికే ఎన్నో సర్వేలు తెలిపిన సంగతి తెలిసిందే.. మరి మరోసారి జగన్ అధికారం అందుకుంటారో లేదో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: