దేశ రాజకీయాల్లో సంచలనాల సృష్టించిన ఫ్యామిలీ అంటే  గాంధీ ఫ్యామిలీ అని చెప్పవచ్చు. మీ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే తరతరాలుగా  ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ  ఇలా ఎంతోమంది దేశాన్ని పాలించారు.  ఇక వీరి వారసులుగా ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న నాయకులు  రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ. ప్రస్తుతం వీరి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ  ముందుకు నడుస్తోంది. 2019 ఎన్నికల్లో మాత్రం వీరు నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం పొందుకోలేదు.  దీంతో కాస్త ఆలోచనకు వచ్చినటువంటి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ పదవుల కోసం ఆశపడకుండా పార్టీ కోసం కష్టపడ్డారు. 2024 వచ్చేసరికి పార్టీని కాస్త గాడిలో పెట్టారు అని చెప్పవచ్చు. ఇందులో కీలక పాత్ర పోషించింది ప్రియాంక గాంధీ.

 రాహుల్ గాంధీ విఫలమైతే ఆ పార్టీని లీడ్ చేసే శక్తి ప్రియాంక గాంధీకి ఉందని నిరూపించుకుంటుంది.  ఎలాంటి ప్రియాంక గాంధీ గాంధీ పోటీ చేసేవి గెలిచినటువంటి వై ఆర్ నాట్ లో పోటీకి దిగుతోంది. ఇక్కడ ఆమె విజయం సాధిస్తే మాత్రం  కాంగ్రెస్ రాజకీయాల్లో తన స్టైల్ మార్చుకొని రాజకీయాలు చేస్తుందని చెప్పవచ్చు. గెలవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. ప్రియాంక ప్రస్తుత రాజకీయాల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఎంపికైంది ప్రియాంక. నెమ్మదిగా తన రాజకీయ చతురతను చూపిస్తూ వచ్చింది. ముందుగా ఆమెకి రాయబరేలి ప్రచారానికి పరిమితమైన ఈమె, గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజల్లో ఉంటూ పార్టీ కోసం పనిచేయడం మొదలు పెట్టింది. 2019 ఎన్నికల తర్వాత కాంగ్రెస్లో కీలక నేతగా మారింది. ఇక 2024 ఎన్నికల వరకు కాంగ్రెస్లో రాహుల్ తర్వాత ప్రియాంక అనే పేరు తెచ్చుకుంది. 2022లో యూపీలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరోభావాన్ని పొందింది.

 ఆ టైంలో యూపీ ఇన్చార్జిగా ఉన్న ప్రియాంక రాహుల్తో కలిసి రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేసింది. కానీ ఆ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ఘోరంగా పరాభవం పొందింది. ప్రియాంక పై విపరీతంగా విమర్శలు వచ్చాయి. ఇక ఓటమించే పాఠాలు నేర్చుకున్న ప్రియాంక గాంధీ, యూపీలో ప్రతిపక్ష పార్టీలను అన్నిటినీ ఏకం చేసి 2024లో గట్టి పోటీ ఇచ్చింది. దీంతో రాహుల్ రాజీనామా చేసిన వై ఆర్ నాట్ నుంచి ఆమెను పోటీ చేయించి గెలిపించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఆమె విజయం సాధిస్తే మాత్రం  దక్షిణాదికి  కాంగ్రెస్ ప్రతినిధిగా చలామణి అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఉత్తరాదిలో రాహుల్ ఉంటే దక్షిణాదిలో ప్రియాంక ఇద్దరు కలిసి దేశవ్యాప్తంగా  కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తారని సమాచారం. విధంగా రాహుల్ తో సమానంగా ప్రియాంక గాంధీ దేశ రాజకీయాల్లో ఎదుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: