వైసిపి మాజీమంత్రి విడుదల రజిని విషయంలో  పసుమర్రు  రైతులు సైతం నిన్నటి రోజున ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుని కలిసి ఎస్పీ ని సైతం కలిసి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా మాజీ మంత్రి విడుదల రజిని పైన చర్యలు తీసుకోవాలంటే తమకు న్యాయం చేయాలంటూ పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికార్గ్ కి కంప్లైంట్ చేయడం జరిగింది.ముఖ్యంగా తమ ఊరిలో జగనన్న కాలనీ పేరు మీద 200 ఎకరాలు భూమిని సేకరించారని తమ నుంచి ఒక్కో ఎకరానికి రెండున్నర లక్షల రూపాయలు లంచం తీసుకున్నారంటు విడుదల రజినీ పైన ఆరోపణలు చేశారు.


ఫేసు లవారిగా భూమిని కొన్న రజిని ఒక ఫస్ట్ పేస్ లోనే రైతుల నుంచి కోటి రూపాయల వరకు అందుకుంది అంటూ ఆరోపించారు. ఆమె పిఏ బంధువు గోపి డబ్బులు వసూలు చేశారంటూ పసుమర్రు  రైతులు సైతం తెలియజేయడం జరిగింది.మధ్యవర్తిగా చెందిన ఉమామహేశ్వరరావు ద్వారా చెక్కులు క్యాష్ తీసుకున్నారని తెలియజేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి రైతుల నుంచి పూర్తి వివరాలను ఎస్పీ సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడే ఎస్పీ కూడా విచారణ జరిపి రైతులందరికీ న్యాయం చేస్తామంటూ హామీ కూడా ఇవ్వడం జరిగింది.అయితే ఇదే వ్యవహారం పైన ముందుగా చిలకలూరిపేట ఎమ్మెల్యే మాజీమంత్రి పుల్లారావుని సైతం రైతులు కలవడం జరిగింది. ఇళ్ల స్థలాల పేరు మీద సుమారుగా 10 కోట్ల రూపాయలు వసూలు చేశారని తమ దగ్గర డబ్బులు తీసుకొని డబ్బులు తీరిక ఇవ్వమంటే బెదిరించారని ఎమ్మెల్యే పుల్లారావుని రైతుల సైతం వేడుకోవడం జరిగింది గతంలో ఆమెకు భయపడి ఎలాంటి కంప్లైంట్ చేయలేదని కూడా అక్కడ రైతులు తెలియజేశారు.. జగనన్న కాలనీలో చాలా అవినీతి జరిగిందని సీఎం చంద్రబాబు దృష్టికి సైతం తీసుకువెళ్తామంటూ పసుమర్రు  రైతులకు న్యాయం చేస్తామంటూ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు మాట ఇచ్చారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: