ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు కూటమిగా అవతరించి మంచి విజయాన్ని అందుకున్నాయి. బిజెపి పార్టీకి ఒక్క శాతం ఓటింగ్ లేకపోయినా 8 మంది ఎమ్మెల్యేలు దక్కడంతో పాటు ఆరు స్థానాలలో పోటీ చేసిన మూడు ఎంపీ స్థానాలు విజయాన్ని అందుకున్నాయి. కూటమి లేకపోతే టిడిపి జనసేన లేకపోతే బీజేపీకి ఈసారి విజయం దక్కేది కాదని చెప్పవచ్చు. 2014లో కూటమి కట్టి ఇద్దరు ఎంపీలను గెలుచుకున్న పార్టీ నలుగురు ఎమ్మెల్యేలను కూడా దక్కించుకోవడం జరిగింది. అయితే 2019లో కూటమితో విభేదాలు వచ్చి విడిపోయారు. అప్పుడు బిజెపి పార్టీ ఓడిపోవడం కూడా దక్కింది.


ఇప్పుడు కూటమి కట్టి భారీ విజయాన్ని అందుకున్న తర్వాత మరొకసారి నేతల మధ్య నోటి దూల ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా నరసాపురం ఎంపీ కేంద్రమంత్రి బిజెపి నాయకులు అయినటువంటి భూపతి రాజు శ్రీనివాస వర్మ తాజాగా కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తాజాగా తన పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడడం జరిగింది.. తనకు ఎంపీ సీటు వచ్చిన తర్వాత కొంతమంది ఎల్లో బ్యాచ్ తనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని తాను పోటీకి అనర్హుడు అని అంటూ టికెట్టు ఇచ్చి వృధా చేశారంటూ ఎద్దేవ చేశారట.


ఈ టికెట్ ని రేపో మాపో పోయే నాయకుడు ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కానీ తానేంటో నిరూపించుకున్నారని అలాగే నరసాపురం విజయాన్ని కూడా దక్కించుకున్నారు అంటూ తెలిపారు.ఇప్పటికైనా ఎల్లో మీడియా ఎల్లో బ్యాచ్ పద్ధతిగా ఉండాలంటూ ఫైర్ అయ్యారు. 2009లో ఇక్కడి నుంచే పోటీ చేసిన వర్మకు 11 వేల ఓట్లు వచ్చాయి. ఇప్పుడు కూటమి బలంగా ఉండడం చేత ఏకంగా ఏడు లక్షల ఓట్లు తెచ్చి పెట్టాడట కానీ ఈ విషయాన్ని ఆయన అంగీకరించలేదని కూటమిది టిడిపిది ఏమీ లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే విధంగా పలువురు నేతలు తెలియజేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల పార్టీకే ప్రమాదమని చెప్పవచ్చు. ఇది కూటమిని కూడా చిచ్చుపెట్టే అవకాశం ఉంటుంది. మరి రాబోయే రోజుల్లో ఇలాంటి వాక్యాలు ఎక్కువైతే కచ్చితంగా కూటమికి చేటు అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: