నిజానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తో పాటు.. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అందరికన్నా ముందు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అప్పట్లో బీఆర్ఎస్ అంతా ఒక్కసారిగా షాక్ అయిపోయింది. కేసీఆర్ సొంత జిల్లా నుంచి ఏకంగా ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు అంటే కేడర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ తర్వాత కేసీఆర్ ఎమ్మెల్యేలను కలవడం మొదలుపెట్టారు. మహిపాల్ రెడ్డి కూడా నేను పార్టీ మారను అని మీడియా ముందుకు వచ్చి ప్రకటించారు. అయితే ఇప్పుడు చాలా సింపుల్గా కండువా మార్చేశారు. ఇక మిగిలిన ఎమ్మెల్యేలు కూడా లైన్లో ఉన్నారు.
ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేల కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. తమ పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకమే.. ప్రజలు కాంగ్రెస్‌కు పరిపాలించమని అవకాశం ఇస్తే.. మూడు నెలల్లో సర్కార్ పడిపోతుందని బిఆర్ఎస్‌యే మొదలుపెట్టింది. ప్రజాతీర్పును కాపాడేందుకు ఇష్టం లేకున్నా ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నాం అంటూ కాంగ్రెస్ ఎదురుదాడి మొదలుపెట్టేసింది. ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 22 లేదా 24 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ లోపు బీఆర్ఎస్ఎల్పీ వీలినానికి సరిపడా నెంబర్‌ను పూర్తిచేసేలా పలువురు బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవాలని టార్గెట్‌తో రేవంత్ రెడ్డి కనబడుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి