- రాజారెడ్డి నుంచి మొదలు జగన్ రెడ్డి దాకా.
- రాజకీయాల్లో రాటు తేలిన వైయస్ కుటుంబీకులు.


 జగన్మోహన్ రెడ్డి  తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకొని  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుగులేని లీడర్ గా ఎదిగారు. తండ్రి మరణం తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి  కుటుంబీకుల రాజకీయ ప్రస్థానం గురించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 వైయస్ కుటుంబ పాలిటిక్స్ :
తెలుగు రాష్ట్రాల్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరు చెరిగిపోనిది. ఆయన ప్రవేశపెట్టిన చాలా పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి అంటే అవి ఎంతటి ప్రాచుర్యం పొందాయో అర్థం చేసుకోవచ్చు. అందుకే జగన్ ఎలాంటి పాపులారిటీ లేకున్నా తండ్రి పేరుతోనే 2019 అధికారంలోకి రాగలిగాడు. అలాంటి వైయస్ కుటుంబం గురించి కొన్ని విషయాలు చూద్దాం. వైయస్ రాజశేఖర్ రెడ్డి తండ్రికి ఫ్యాక్షనిస్టుగా ముద్ర ఉంది. ఆ విధంగా రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డి  సర్పంచ్ గా మొదలు రాజకీయాల్లో రాటు తేలారు. అప్పట్లోనే రైల్వే కాంట్రాక్టులు లాంటివి చేస్తూ తన పలుకుబడిని పెంచుకున్నారు. అప్పట్లో వైయస్ రాజారెడ్డి అంటే కడప జిల్లా వణికిపోయేది.   1998 మే 23న రాజారెడ్డి హత్యకు గురై మరణించారు. అయితే రాజారెడ్డి మంచి ఫామ్ లో ఉన్నప్పుడే వైయస్ బాగా చదివి డాక్టర్ అయ్యాడు. ఆ సమయంలో తన డాక్టర్ వృత్తితో పేదలకు సేవ చేయాలనే విధంగా మలుచుకున్నాడు. మొట్టమొదటగా జమ్మలడుగు మిషన్ ఆస్పత్రిలో పనిచేశారు. 


ఆ తర్వాత 1973లో  ఒక్క రూపాయి పేదల దగ్గర తీసుకోకుండా ట్రీట్మెంట్ చేసే డాక్టర్ గా పేరు పొందారు. ఆ తర్వాత డెబ్బై పడకల ఆసుపత్రిని సొంత డబ్బులతో ఏర్పాటు చేశారు. 1978లో అసెంబ్లీకి మొదటిసారిగా ఎన్నికైన వైఎస్ 1980 నుంచి 1983 వరకు మంత్రిగా కూడా చేశారు. ఈ సమయంలో ఎన్టీఆర్ పార్టీ పెట్టారు. ఆ టైంలో రాష్ట్రమంతా కాంగ్రెస్ ఓడిపోయింది.  కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రం భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇక 1989లో ఎంపీగా పోటీ చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి , 1998లో రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆ తర్వాత వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ద్వారా ప్రజల మన్ననలు పొందారు. అలా రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసి అద్భుతమైన పథకాలు తీసుకొచ్చి పేదల దేవుడయ్యారు. చివరికి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. అలాంటి ఈయన రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకొని జగన్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఏపీ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. తర్వాత 2023 ఎలక్షన్స్ లో టిడిపి చేతుల్లో దారుణంగా ఓటమిపాలై ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఈ విధంగా రాజారెడ్డి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకొని రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, వివేకానంద రెడ్డి, వైఎస్ షర్మిల, సునీత రెడ్డి, ఇలా వీరంతా రాజకీయాల్లో రాణిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: