అయితే జగన్ సీఎం అయిన తర్వాత అమరావతి అనంతపూర్ ఎక్స్ ప్రెస్ వేకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. జాతీయ రహదారి నంబర్ కూడా కేటాయించిన ఎక్స్ ప్రెస్ వేను తెరమరుగు చేసి తన సొంత నియోజకవర్గం మీదుగా ఎక్స్ ప్రెస్ వేని మంజూరు చేయించుకుని పక్షపాతం చూపించారనే ఆరోపణలు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో టీడీపీకి అధికారంలోకి రావడంతో అనంత అమరావతి ఎక్స్ ప్రెస్ వేకు ఈ ప్రభుత్వం ఊపిరి పోయాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
మరో రెండు మూడేళ్లలో వీటిని పూర్తి చేసే అవకాశం అయితే ఉందని భోగట్టా. అనంత అమరావతి ఎక్స్ ప్రెస్ వేని జగన్ సర్కార్ పూర్తిగా పక్కన పెట్టేసింది. ఈ ప్రభుత్వం వేగంగా డీపీఆర్ ల రూపకల్పన దిశగా అడుగులు వేసి ఆ తర్వాత టెండర్లు పిలిచి పనులు చేపడితే బాగుంటుందని చెప్పవచ్చు. అవసరమైన భూముల కోసం పెగ్ మార్కింగ్ ను సైతం పూర్తి చేసిన నేపథ్యంలో భూ సేకరణ చకచకా జరిగే వీలుంటుంది.
బెంగళూరుతో పాటు సీమవాసులు తక్కువ సమయంలో అమరావతి చేరుకునేలా బాబు సర్కార్ 2014 2019 మధ్య బాబు సర్కార్ అనంతపూర్ నుంచి అమరావతికి యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వేని ప్రతిపాదించడం జరిగింది. రాప్తాడు మండలం దగ్గర మొదలై అమరావతికి చేరుకునేలా 393 కిలోమీటర్ల మేర ఎక్స్ ప్రెస్ వే మంజూరైంది. మొదట జగన్ సర్కార్ అమరావతి వరకు కాకుండా ఈ ఎక్స్ ప్రెస్ వేని చిలకలూరి పేట బైపాస్ లో కలిపేందుకు ప్రతిపాదనలు చేసి ఆ తర్వాత ఈ పనులను విస్మరించింది.