
ఏపీ లో మరో ఎన్నికకు రంగం సిద్ధమైంది. వైసీపీ మాజీ నాయకులు .. కీలక నేత వేణుంబాక విజయ సాయి రెడ్డి కొద్ది నెలల క్రిందట వైసీపీ కి రాజీనామా చేయడంతో పాటు తన రాజ్యసభ పదవి ని కూడా వదులుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు కూడా ప్రకటించారు. ఇది ఎమ్మెల్యే కోటా రాజ్యసభ సీటు. దీంతో ఇప్పుడు మల్లీ ఎమ్మెల్యే కోటాలో ఈ సీటుకు ఉప ఎన్నిక జరుగుతుంది. వాస్తవానికి జగన్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు విజయ సాయికి రెండో సారి కేటాయించారు. ఇక ఈ సీటు కు తాజాగా బుధవారం ఉదయం కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ నెల 29 వరకు నామినేషన్ వేసేందుకు అవకాశం ఉంది. మే 9న ఎన్నికల పోలింగ్ జరగనుంది.
ఇక ఈ సీటుకు సంఖ్యా బలం ప్రకారం ఈ సీటు కూడా కూటమి పార్టీలకే దక్కుతుంది. ఈ క్రమంలోనే ఈ సీటు ఎవరికి దక్కుతుంది ? ఎవరిని వరిస్తుందన్న దానిపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. జనసేన ఆది నుంచి ఈ ఈ విషయంలో దూకుడు గా ఉంది. రాజ్యసభలో తమకు ప్రాథినిత్యం లేదని .. లోక్‌సభలో రెండు ఎంపీ సీట్లు ఉన్నాయని రాజ్యసభలో బలం లేదని తమకే ఈ సీటు కావాలని పట్టు బడుతోంది.
ఇక టీడీపీ నుంచి చూసుకుంటే మాజీ మంత్రి .. పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు వంటి సీనియర్ మోస్టు నాయకులు రాజ్యసభకు వెళ్లాలన్న కోరికను ఓపెన్ గానే వ్యక్తం చేస్తున్నారు. ఇక మరో మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ లాంటి వారు కూడా ఉన్నారు. మరి సీటు గెలిచే విన్నర్ ఎవరో తెలియాలంటే నెల 24 వరకు టెన్షన్ కొనసాగనుంది.