
ఇండియా పైన సీమాంతర ఉగ్రవాదులు సైతం కుట్ర పడినట్లుగా భావించిన భారత్ మొత్తం తొమ్మిది సావరాల పైన ఆర్మీ దాడులు చేశారు. పాక్ సహాయంతో ఎక్కడ దాక్కున ఉగ్రవాదులను వదిలిపెట్టేది లేదని తెలియజేసింది. దేశవ్యాప్తంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం మార్క్ డ్రిల్స్ సైతం నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో ఈ దాడులు చేయడంతో చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ పైన పలువురు కేంద్ర మంత్రులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉన్నారు.
భారత్ మాతాకీ జై అనే పేరుతో చాలామంది ప్రముఖులు మంత్రులు కూడా పోస్ట్ షేర్ చేస్తూ ఉన్నారు. పహల్గాం దాడికి దీటుగానే జవాబు ఇచ్చారని తెలుస్తోంది. మెరుపు దాడులకు సంబంధించి వీడియో కూడా రక్షణ శాఖ విడుదల చేయడం జరిగిందట. ఇప్పటివరకు 30 మంది ఉగ్రవాదులు మరణించినట్లుగా నివేదికలు తెలియజేస్తున్నాయి. బాహావల్పూర్ లోని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ ఆజాద్ హెడ్ క్వార్టర్స్ పైన కూడా దాడిలు చేశారట. ఒక్క సమాచారంతో ఆర్మీ మెరుపు దాడులు చేసినట్లు తెలుస్తోంది. దీంతో 30 మంది ఉగ్రవాదులు హతమార్చినట్టుగా సమాచారం. ఈ విషయాన్ని ఫాక్ మీడియాలో కూడా అధికారికంగా ధ్రువీకరించారు. మరి ముందు ముందు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.