
"మా దేశాన్ని అల్లా కాపాడాలి, మేము ఎంతో నష్టపోయాం, ప్రపంచంలో మాకు అన్యాయం జరుగుతోంది" అంటూ ఓ ఎంపీ తన ఆవేదనను, నిస్సహాయతను వెళ్లగక్కడం ఇప్పుడు హాట్ టాపిక్. "కశ్మీర్ మాదే, ముస్లింలంతా ఏకం కండి" అంటూ పాత పాటే అందుకుంటూనే, ప్రస్తుత దుస్థితిపై కన్నీళ్లు పెట్టుకోవడం వారి దీనస్థితికి అద్దం పడుతోంది. కొందరు ఎంపీలైతే "దేవుడా మమ్మల్ని కాపాడు" అంటూ సభలోనే భోరున విలపించడం చూస్తుంటే, పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఒకప్పుడు మన దేశంలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించినప్పుడు, అమాయకులైన ప్రజలు ప్రాణాలు కోల్పోయినప్పుడు, వారి కుటుంబ సభ్యులు, భార్యాబిడ్డలు కన్నీరుమున్నీరుగా విలపించినప్పుడు ఇదే పాకిస్తాన్ పైశాచిక ఆనందం పొందింది. ఉగ్రవాదాన్ని ఓ గొప్ప కార్యంగా కీర్తిస్తూ, భారత ప్రజల బాధను చూసి ఎగతాళి చేసింది. కానీ ఇప్పుడు, అదే తరహా నొప్పి తమకే తగిలేసరికి, తమవారిని వేటాడి మరీ మట్టుబెడుతుంటే, ఆ బాధ ఎలా ఉంటుందో పాక్ ఎంపీలకు ఇప్పుడు తెలిసివచ్చినట్టుంది.
అందుకే, చట్టసభల్లో కూర్చుని మరీ మొసలి కన్నీరు కారుస్తున్నారు. కర్మ సిద్ధాంతం అంటే ఇదేనేమో. చేసిన పాపం ఊరికే పోదన్న సత్యం ఇప్పుడు పాకిస్తాన్‌కు అనుభవపూర్వకంగా అర్థమవుతున్నట్లుంది. ఈ పరిణామాలు చూస్తుంటే, భవిష్యత్తులో మరిన్ని ఆసక్తికరమైన మలుపులు చూడాల్సిందేననిపిస్తోంది. ఏది ఏమైనా పాకిస్తాన్ వాళ్ళు చేసిన తప్పులకు ఇప్పుడు పర్యవసనాలను అనుభవిస్తున్నారు.