
పహల్గాం ఘటన కు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ తీసుకువచ్చింది మోడీ ప్రభుత్వం. మొత్తం తొమ్మిది స్థావరాలలో ఒకేసారి బాంబు దాడులు చేసింది ఇండియా. ఈ దెబ్బకు వందమంది ఉగ్రవాదులు మరణించారు. ముఖ్యంగా జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబం కూడా ఈ బాంబు దాడిలో అభివృద్ధి చెందింది. ఆయన కుటుంబంలోని దాదాపు 14 మంది మరణించారు. ఇందులో జైసి మహమ్మద్ మసూద్ అజార్ కుటుంబానికి సంబంధించిన అక్క చెల్లెలు, బావలు, పిల్లలు అందరూ మరణించారు.
అయితే తాజాగా పాకిస్తాన్ ప్రధాని షరీఫ్... కీలక నిర్ణయం తీసుకున్నారు. మసూద్ అజార్ కుటుంబానికి పరిహారం చెల్లించారు. మొత్తం 14 కోట్ల రూపాయలను అందించారు. దీంతో మరోసారి పాకిస్తాన్, ఉగ్రవాదులకు ఉన్న సంబంధం బయట పడింది. మసూద్ అజార్ కుటుంబంలో 14 మంది మరణించిన నేపథ్యంలో ఒక్కొక్కరికి ఒక్కో కోటి ఇవ్వడం జరిగింది. ఇది ఇలా ఉండగా... గతంలో ఇండియాలో అనేక దాడులకు పాల్పడ్డాడు మసూద్ అజార్. అలాంటి వ్యక్తికి పాకిస్తాన్ ఆర్థిక సహాయం చేసి మరోసారి కుట్ర కోణాన్ని బయటపెట్టింది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు