టిడిపి నేతలు, కార్యకర్తలు  ఈ నెలలో జరిగేటువంటి మహానాడు సభకు వెళ్లాలని చాలా కుతూహలంగా ఉన్నారు. అయితే అంతకుముందే కొన్ని నియోజకవర్గాలలో మినీ మహానాడు పేరుతో పలు రకాల కార్యక్రమాలను చేపడుతున్నారు. అలా ఈ రోజున ఉదయం 10 గంటలకు అనంతపురం అర్బన్ లో కమ్మ భవన్ లో మినీ మహానాడు నిర్వహించారు. అయితే ఇక్కడకు పలువురు టిడిపి నేతలతో పాటు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. ఇలాంటి సమయంలోనే ఒక టిడిపి నాయకుడు ఆత్మహత్యాయత్నం  చేసినట్లుగా తెలుస్తోంది.



కమ్మ భవన్ లో నిర్వహించిన మినీ మహానాడు సభకు హాజరైన ఎస్పీ సేల్ నగర అధ్యక్షుడిగా పేరుపొందిన వెంకటేశులు ఒక్కసారిగా కింద పడిపోయారు.. అయితే ఈ నేత నోటి నుండి కూడా నురుగు రావడంతో ఈ విషయాన్ని గమనించిన అక్కడ కొంతమంది టిడిపి నాయకులు, కార్యకర్తలు సైతం వెంటనే హుటాహుటిగా ఆసుపత్రికి తరలించారు. టిడిపి నేత వెంకటేశులు ఎందుకు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారనే విషయం ఇంకా తెలియాల్సి ఉన్నది. మినీ మహానాడు జరుగుతున్న సభలో ఇలాంటి ఘటన అందరిని కలిసి వేస్తోంది.


మరి ఈ విషయంపై అక్కడ టిడిపి నేతలు ఏ విధంగా మాట్లాడతారనే విషయం పైన కూడా కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ మినీ మహానాడులో గత రెండేళ్లలో మరణించిన వారందరికీ కూడా సంతాపాన్ని తెలియజేసేలా ప్లాన్ చేశారట. అలాగే పార్టీలో భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను కూడా మహానాడులో ప్రకటిస్తూ.. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజలలోకి తీసుకువెళ్లాలని విధంగా పార్టీ నేతలకు సూచించారు. టిడిపి పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి మినీ మహానాడు కావడంతో దిగ్విజయంగా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. కానీ టిడిపి నేత వెంకటేశులు సూసైడ్ అటెంప్ట్ మాత్రం ఒక మచ్చగా మిగిలిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: