TDP MAHANADU: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ దూకుడుగా ముందుకు వెళ్తోంది. వైసిపి పార్టీ ని చిక్కుల్లో పెడుతూ.. రాజకీయ చదరంగం మొదలుపెట్టింది టిడిపి. ఈ నేపథ్యంలోనే మహానాడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది తెలుగుదేశం పార్టీ. అది కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో టిడిపి మహానాడుకు శ్రీకారం చుట్టనుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లాంటి అగ్ర నేతలు కడప జిల్లాకు చేరుకున్నారు.

 మరికొన్ని గంటల్లోనే ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. అయితే ఈ కార్యక్రమానికి కంటే ముందే వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ ఇచ్చింది చంద్రబాబు కూటమి ప్రభుత్వం.   వైయస్సార్ జిల్లా  పేరును మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు దీనిపై నిర్ణయం తీసుకొని చంద్రబాబు ప్రభుత్వం... మహానాడు కార్యక్రమం ప్రారంభం కంటే ముందు రోజు.. అంటే సోమవారం రోజున వైఎస్ఆర్ జిల్లా ( ysr ) పేరు మార్చుతూ ఆదేశాలు ఇచ్చింది.

 దీంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. దీనిపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టిడిపి మహానాడు లో వైయస్సార్ జిల్లా అని పేరు పలకాల్సిన పరిస్థితి ఉంటుందని.. అందుకే సీఎం చంద్రబాబు నాయుడు ఇలాంటి కుట్రలకు తెరలైపోయాడని ఫైర్ అవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గొప్ప నాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి.. అలాంటి నాయకుడిని అవమానించేలా చంద్రబాబు వ్యవహరించాలని మండిపడుతున్నారు.




వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: