
మహానాడును కడప శివారులోని చెర్లోపల్లిలో ఏర్పాటు చేస్తున్నారు. మొదటి రెండు రోజులు ప్రతినిధుల సభ చివరి రోజు బహిరంగ సభ కూడా చేయబోతున్నారు. ముఖ్యంగా 140 ఎకరాలలో ఈ సభని ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్ కోసమే 500 ఎకరాలను కేటాయించారు. టిడిపి పార్టీ భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అందుకు అనుగుణంగా ప్రతిపాదన అంశాలను కూడా ఈ మహానాడుగా చేర్చించబోతున్నారట. అలాగే ఏపీ ప్రజలకు సంబంధించి అన్ని విషయాలను కూడా ఈ మహానాడులో చర్చించే విధంగా టిడిపి భావిస్తోంది.
ఇందుకు సంబంధించి షెడ్యూల్ ని కూడా ఖరారు అయినట్లుగా తెలుస్తోంది..
1). ఉదయం 8: 30 నుంచి 10 గంటల వరకు ప్రతినిధుల నమోదు ఉంటుంది..
2). 10 నుంచి 10:45 వరకు ఫోటో ప్రదర్శన రక్త శిబిర కార్యక్రమాలు ఉంటాయి
3).10:45 నుంచి ప్రతినిధుల సభను పార్టీ జెండా ఆవిష్కరణ ఉంటుందట.
4).11:30 నుంచి 11:45 వరకు రాష్ట్ర అధ్యక్షుడు ప్రసంగం ఉంటుంది.
5).11:50 నుంచి 12:45 వరకు ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడతారు
6).12:45 నుంచి 1:00 టిడిపి పార్టీకి సంబంధించి ఆరు సూత్రాల ఆవిష్కరణ పైన చర్చలు ఉంటాయట.
7). జాతీయ పార్టీకి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ 1:00 కి.
8).2:00 నుంచి 3:30 మధ్య కార్యకర్తల పైన చర్చలు జరుగుతాయి.
9).3:30 నుంచి 5:00 గంటలకు ఉపాధి, యువత సంక్షేమ, వాట్సాప్ గవర్నర్ పైన చర్చలు జరుగుతాయి అట.
10). సాయంత్రం 5:00 నుంచి 6:00 గంటల వరకు వెనకబడిన ప్రాంతాలు సదుపాయాలు రాష్ట్ర అభివృద్ధిపై చర్చలు.