
ఆళ్లగడ్డ పట్టణంలో కొంతమంది టిడిపి నేతలు తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి అధికారులను ప్రయోగించినట్లుగా వినిపిస్తున్నాయి. అలా మున్సిపాలిటీ అధికారులు ,పశువర్ధన శాఖ అధికారులతో కలిసి చికెన్ సెంటర్ల దగ్గరకు వెళ్లి మరి మీ దగ్గర ఉండే చికెన్ తింటూ ఉంటే రోగాలు వస్తున్నాయని ఫిర్యాదులు వచ్చాయని.. అందుకే కోళ్లను చికెన్ ను పరీక్షించేందుకే వచ్చామంటూ అధికారులు తెలియజేశారట.. దీంతో అక్కడున్న వ్యాపారస్తులు అందరూ కూడా తాము 40 ఏళ్లుగా ఈ చికెన్ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నామని ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఎందుకు అధికారులు వచ్చారు అంటూ గొడవకు దిగారట.
ముఖ్యంగా మీరు ఎవరు పంపితే వచ్చారో మాకు తెలుసు.. మా దగ్గర ఉండి చికెన్ ని వండి పెడతాము మా కుటుంబ సభ్యులతో పాటు ఎవరైనా సరే తినండి ఎవరికైనా అస్వస్థత వస్తే మాపైన చర్యలు తీసుకోండి.. ఈరోజు శాంపుల్ గా చికెన్ తీసుకొని వెళ్లి మరి రెండు రోజుల తర్వాత పరీక్షించి పాడైపోయిందంటే అది కుదరదు అంటూ హెచ్చరించారు. అయినా కూడా అధికారులు శాంపుల్ తీసుకు వెళదామంటూ బెదిరించడంతో కొంతమంది వ్యాపారస్తులు పురుగుమందు డబ్బాలు పట్టుకొని ఆత్మహత్య ప్రయత్నం చేశారు..దీనితో ఒక్కసారిగా అక్కడి నుంచి అధికారులు పారిపోయారట. అధికారులు కూడా రూ .5రూపాయలు కిలో మిద కమిషన్ ఇవ్వండి అంటూ అడుగుతున్నారని ఆ చికెన్ సెంటర్ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. అలాగే 8 సెంటర్ల పైన శుక్రవారం రోజున పంచాయితీ అధికారులు నోటీసులు ఇచ్చారట. లైసెన్స్ లేని కారణంగా ఈ షాపులను సీజ్ చేసినట్లు సమాచారం. లైసెన్స్ లేకుండా ఎవరూ కూడా చికెన్ అమ్మ కూడదంటే ఈఓపిఆర్డి తాహిర్ హుస్సేన్ తెలిపారు.