
నిన్న రాత్రి కీవ్ నగరంపై ఆకాశం నిప్పుల వర్షం కురిపించినట్టుగా రష్యా తన ప్రతాపం చూపించింది. మిస్సైళ్ల వర్షం, డ్రోన్ల దండుతో ఉక్రెయిన్ గుండెకాయ లాంటి కీవ్‌ను రష్యా సైన్యంక్షతగాత్రంగా మార్చేసింది. తెల్లారేసరికి నగరం బూడిద కుప్పగా మారిందని, అనేక కీలక ప్రాంతాలు బూడిదైపోయాయని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇది కేవలం ఒక్క రోజుతో ఆగిపోలేదు, ఎడతెరిపి లేకుండా క్షిపణులు, డ్రోన్లు కీవ్ నగరాన్ని చుట్టుముడుతూనే ఉన్నాయి.
ఉక్రెయిన్ చేసిన ఒక్క దాడికి భారీ పబ్లిసిటీ రాగా, రష్యా ఇప్పుడు సృష్టిస్తున్న ఈ భారీ విధ్వంసం మాత్రం ప్రపంచ మీడియాలో కేవలం మరో వార్తగా మిగిలిపోతోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. వరుస దాడులతో కీవ్ నగరం మరుభూమిని తలపిస్తోంది. సర్వనాశనం అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా ఉక్రెయిన్ రాజధాని మారిపోయింది. ప్రతి వీధిలోనూ విధ్వంసం తన ముద్రను స్పష్టంగా వేసి వెళ్ళింది.
ఒక్క దెబ్బకు వంద దెబ్బలు రుచి చూపిస్తామన్నట్టుగా రష్యా తన సైనిక శక్తిని మొత్తం ఉక్రెయిన్‌పై ప్రయోగిస్తోంది. ఇది ఎవరు ఊహించని పరిణామం అని చెప్పుకోవచ్చు. ఈ ప్రతీకార దాడితో ఉక్రెయిన్‌కు కోలుకోలేని నష్టాన్ని మిగిల్చి, యుద్ధంలో తమదే పైచేయి అని పుతిన్ సర్కార్ ప్రపంచానికి గట్టి సంకేతాలు పంపుతోంది. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి. ఇలాంటి యుద్ధాలు ఆగకపోతే అందరికీ నష్టమే.