
చర్చా కార్యక్రమంలో కొమ్మినేని ఆధ్వర్యంలోనే వివాదాస్పద వ్యాఖ్యలు వెలువడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ డిబేట్‌లో వీవీఆర్ కృష్ణంరాజు అమరావతిని “వేశ్యల రాజధాని”గా అభివర్ణించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, కొమ్మినేని వాటిని ఖండించకుండా సమర్థించినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. కృష్ణంరాజును పరోక్షంగా ప్రోత్సహించడం ద్వారా కొమ్మినేని ఈ వివాదానికి మూలమయ్యారని పోలీసులు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయని, స్థానిక మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీశాయని వారు వివరించారు.
విచారణలో కొమ్మినేని సహకరించకపోవడం గమనార్హం. దర్యాప్తు సంస్థలను తప్పుదోవ పట్టించేలా జవాబులు ఇచ్చినట్లు రిమాండ్ రిపోర్టు వెల్లడించింది. అతనిని మరింత ప్రశ్నిస్తే ఈ కుట్రకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. సాక్షులను విచారించడం, ఈ డిబేట్ వెనుక ఉన్న ఉద్దేశాలను లోతుగా పరిశీలించడం అవసరమని వారు పేర్కొన్నారు. కొమ్మినేనిని రిమాండ్‌కు పంపాలని పోలీసులు కోర్టును కోరారు, దీనివల్ల దర్యాప్తు వేగవంతం అవుతుందని భావిస్తున్నారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు