అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్ కి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI171   ఈరోజు మధ్యాహ్నం ఒక్కసారిగా ప్రమాదానికి గురైంది.ఇందులో 242 మంది ప్రయాణికులు ఉన్నారని అలాగే స్టాఫ్ కూడా ఉన్నారని ఎయిర్ ఇండియా తెలియజేసింది. ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు రాలేదు. కానీ ఈ ఘటనకు సంబంధించి పలు రకాల ఫోటోలు వీడియోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. అహ్మదాబాద్ లో కూలిపోయిన ఈ ఎయిర్ ఇండియా విమానం చాలా ప్రత్యేకమని విశ్లేషకులు తెలియజేస్తున్నారు. మరి ఈ విమానం  యొక్క ప్రత్యేకతలను చూద్దాం.


కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం సాధారణమైనది కాదని ఇండియాలోనే అత్యంత ఆధునిక సాంకేతిక ,పరిజ్ఞానాలు కలిగిన విమానాలను ఒకటని. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ గా తెలిపారు. ఈ విమానాన్ని ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సదూర మార్గాలలో కూడా ఉపయోగిస్తుందట. దీని ఇంధన సామర్థ్యం ప్రయాణికుల సామర్థ్యం కూడా ఎక్కువగా ఉంటుందని మంచి సౌకర్యాన్ని కలిగిస్తుందని తెలుపుతున్నారు. ఇండియాలో ఇప్పటివరకు ఇలాంటి విమానం ఒక్కటే ఉన్నది.. ఇదే అని తెలిపారు. దీనిని బిజినెస్ క్లాస్ 18 సీట్లు, ఎకనామిక్ క్లాస్ 238 సీట్లు ఉన్నవిగా తెలిపారు.



ఇందులో చాలా కంఫర్టబుల్గా అనిపించే సీట్లు కూడా కలవని ఇందులో వెరైటీ ఫుడ్స్ ఫ్రీ డ్రింక్స్ వంటివి కూడా అందుబాటులో ఉండేవట. ఈ విమానంలో అధిక నాణ్యత సౌకర్యాలు కలిగిన కిట్టులను కూడా అమర్చారు. ఈ విమానం ఇతర విమానాల కంటే 20 శాతం ఎక్కువగా ఇంధన సౌకర్యం కలిగి ఉంటుందని.. ఇందులో ఎన్నో వినోద వ్యవస్థలు ఎక్కువ స్థలంతో సౌకర్యవంతమైన సీట్లను కూడా కలిగి ఉంటుంది.787 -8 విమానం 2025 నాటికి ఎయిర్ ఇండియా విమానంలో చేర్చాలని షెడ్యూల్ ను కూడా చేర్చారట. ఈ మోడల్ కోసం పెద్ద ఆర్డర్స్ వచ్చాయని ప్రస్తుతం మూడు విమానాల తయారీలలో ఉన్నదట.

మరింత సమాచారం తెలుసుకోండి: