
మన గొప్ప అమెరికన్ వారియర్లకు అభినందనలు.. ప్రపంచంలోనే ఏ సైన్యం చేయలేరని ఇలా ఇప్పుడు శాంతికి సమయం అంటూ ట్రంప్ వెల్లడించారు. నిన్నటి రోజున రాత్రి 10 గంటలకు దేశాన్ని ఉద్దేశిస్తే ప్రసంగాన్ని కూడా చేశారు ట్రంప్. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వివాద పరిష్కారం అవ్వడానికి రెండు వారాలు సమయాన్ని కూడా ప్రకటించారు.. కానీ అలా మాట చెప్పి కేవలం 48 గంటలలోనే ఇరాన్ పై ఇలాంటి భీకరమైన దారి దిగడంతో అందరూ ఆశ్చర్యపోయారు.. అయితే ఇరాన్ తో చర్చలు జరిపే అవకాశం ఉన్నది అలాగే రాబోయే రెండు వారాలలో చర్చలు జరపాల వద్ద అనే విషయం పైన కూడా నిర్ణయం తీసుకుంటాను అంటూ ట్రంప్ వైట్ హౌస్ లో తెలియజేశారు.
ఇరాన్ పైన దాడికి దిగడంతో ఇరాన్ సుప్రీమ్ లీడర్ అయతుల్లా మాట్లాడుతూ.. అమెరికా తమ పైన దాడి చేస్తే కచ్చితంగా తాము కూడా అందుకు ప్రతిదాడి కచ్చితంగా చేస్తామని ఈ దెబ్బతో అమెరికాకు ఊహించలేని నష్టాన్ని కూడా చూపిస్తామంటూ ఇరాన్ సుప్రీం లీడర్ తెలియజేశారు.ఇరాన్,ఇజ్రాయెల్ వివాదంలో ఇప్పుడు అమెరికా ఎంట్రీ ఇవ్వడంతో కచ్చితంగా పెద్దపెద్ద దేశాలు అయినా చైనా, రష్యా కూడా ఈ ఉద్యమంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కూడా పాల్గొనే అవకాశం ఉందని విశ్లేషకులు తెలుపుతున్నారు. ఒకవేళ అదే జరిగితే ఇక మూడో యుద్ధమే అంటూ నిపుణులు అభిప్రాయంగా వెల్లడిస్తున్నారు.