
ఇది క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న వాస్తవాలను గుర్తించాలి కూటమి అంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా వెల్లడిస్తున్నారు. వైసిపి పార్టీని మరొకసారి అధికారంలోకి రాకుండా చూస్తామని వైసిపి పార్టీని అందుకునేందుకు తన వ్యాఖ్యలతో ప్రయత్నం చేయవచ్చు.. కానీ క్షేత్రస్థాయిలో మహిళలు, మధ్యతరగతి వాళ్ళు ,రైతులు చాలా అసంతృప్తితో కూటమి ప్రభుత్వం మీద ఉన్నారు. మరి దీనిని ఎలా తగ్గిస్తారనే విషయం మీద దృష్టి పెట్టకపోతే మాత్రం కూటమికే చాలా చేటు అన్నట్లుగా విశ్లేషకులు తెలియజేస్తున్నారు.
అలాగే అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టకపోవడం అమరావతి భూముల విషయంలో రైతులు కూడా ఫైర్ అవుతున్నారు. భూములు ఇకమీదట ఇచ్చేది లేదని ఉద్యమాలకు కూడా సిద్ధమవుతున్నారు. అలాగే ప్రతినెలా కూడా విద్యుత్ చార్జీలు పెంచడం వంటివి చేస్తూ ఉన్నారంటూ ప్రజలు ఫైర్ అవుతున్నారు. అటు యువతను, మహిళలను మోసం చేశారనే విధంగా మాట్లాడుతున్నారు. ఇటీవలే టిడిపి నాయకులు చేపట్టిన సుపరిపాలనలో మొదటి అడుగు కార్యక్రమంలో చాలామంది వీటిని ప్రశ్నిస్తున్నారట. చాలామంది మహిళలు కూడా తల్లికి వందనం పథకాన్ని ఏదో ఒక విధంగా ఎగ్గొట్టారని చాలామంది నిలదీస్తున్నారు. గతంలో నిత్యవసర ధరలు తగ్గిస్తామని చెప్పిన కూటమి కానీ వాటిని ఏమి పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని తెలుపుతున్నారు. ఇంత వ్యతిరేకత ఉంటే వైసీపీని ఎలా అడ్డుకుంటారు అది తేలికైన విషయమేనా అంటూ మాట్లాడడమే కాకుండా ప్రభుత్వ పెద్దలు అన్నిటిని జాగ్రత్తగా వ్యవహరించాలి అంటూ తెలుపుతున్నారు.