2024 ఎన్నికలలో వైసిపి పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఆ వెంటనే కొంతమంది కీలకమైన నేతలు కూటమిలో ఉండే జనసేన ,బిజెపి, టిడిపి పార్టీలోకి చేరారు. అలా ఇప్పుడు వైసీపీని వీడిన చాలామంది లీడర్లు తిరిగి మళ్లీ వైసీపీ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు కొన్ని రకాల ప్రచారం అయితే జరుగుతోంది. కానీ వైసీపీ పార్టీ మాత్రం వారికి స్థానం కల్పించకూడదనే భావనలో ఉన్నట్లు వినిపిస్తున్నాయి. వారు నిజంగానే తిరిగి వస్తున్నారో లేదో తెలియదు కానీ..ఈ గాసిప్ అయితే ఇప్పుడు పొలిటికల్ పరంగా ఆ టాపిక్ గా మారుతున్నది.


కొంతమంది నేతలు రాజకీయ అవసరాల కోసం మరికొంతమంది వ్యాపారాలను కాపాడుకోవడం కోసం కూటమి పార్టీలోకి వెళ్లిపోయారు. ఎంట్రీ బాగానే ఉన్నా కొన్ని సంఘటనల వల్ల టిడిపిలోకి చేరిన వైసిపి నేతల పైన పెద్దగా కూటమి ఇన్ ఫాక్ట్ చూపించలేదట. అలాగే వారికి సంబంధించిన పదవులు, కాంట్రాక్టు పనులు ఏవి కూడా వారికి ఎక్కడ ఇవ్వలేదనే విధంగా అసంతృప్తిలో జంపింగ్ లీడర్ల మధ్య ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే మరి కొంతమంది నియోజకవర్గాలలోని నేతల మధ్య బాండింగ్ కూడా సరిగ్గా లేదని అందుకే తిరిగి వీరు వైసీపీ పార్టీలోకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారని ప్రచారం మొదలయ్యేలా చేసింది.


వైసీపీలో కీలకమైన సామాజిక వర్గానికి సంబంధించి నేతలు కూడా పార్టీని వీడడం జరిగింది. ఇలాంటి సమయంలోనే చాలామంది నేతలు కూడా వైసిపి పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. గత కొద్ది రోజులుగా వైసిపి పార్టీని వీడిన విజయసాయిరెడ్డి కూడా వచ్చేలా ప్లాన్ చేస్తున్నారని వినిపిస్తున్నాయి. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి, దొరబాబు, అల్లా నాని, మోపిదేవి వెంకటరమణ ఇలాంటి వారికి అంత కూడా కూటమిలో చేరిన పెద్దగా గుర్తింపు రాలేదని.. బాధపడుతున్నారట. మరి వీరంతా కూడా తిరిగి వైసిపి లోకి రావడానికి సిద్ధమవుతున్నారనే విధంగా వినిపిస్తున్నాయి. మరి ఈ విషయాల పైన అనేక క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: