- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .

ఏపీలో ఉచిత బస్సులను మహిళలకు ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. మహిళలకు ఇది శుభవార్త గానే చెప్పాలి. అయితే జిల్లాల వరకు మాత్రమే దీనిని పరిమితం చేశారు. ప్రస్తుతం ఏపీలో కొత్త జిల్లాల తరువాత ప్ర‌స్తుతం చిన్న జిల్లాలుగా మారిపోయాయి. ఈ క్రమంలో ఈ ఉచితం అనేది ఏ విధంగా ఉపయోగం అన్నది చంద్రబాబుకే తెలియాలి. ఇక ఉచిత బస్సు అమలులోకి వచ్చిన తర్వాత మరిన్ని కండీషన్లు ఉంటాయోమో అన్న చర్చలు కూడా ఉన్నాయి. ఎన్ని బస్సులు ఉచితానికి కేటాయిస్తారు. వాటి సమయాలు ఎలా ?ఉంటాయి ? ఆ వివరాలు విధి విధానాలు ఇంకా రావాల్సి ఉందంటున్నారు. ఉచిత బస్సు విషయంలో ఇంకా చాలా కథ నడవాల్సి ఉండగా ఆటోవాలాలు మాత్రం అప్పుడే అడ్డు పెట్టేస్తున్నారు.


ఉచిత బ‌స్సు అమ‌లు చేసే ముందు తమ వ్యవహారం చూడాలని ఆటో డ్రైవర్లు కోరుతున్నారు. ఎక్కడికి అక్కడ మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తే తమకు ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని విశాఖలోని ఆటో కార్మిక సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు ప్రత్యామ్నాయం చూపించకపోతే తాము ఉపాధి కోల్పోయి తమ జీవితం దెబ్బతింటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందు తనకు ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతే ఉచిత బస్సులను రోడ్ల మీదకు తేవాలని డిమాండ్ చేస్తున్నారు. కూటమి విజయానికి తాము ఓట్లు వేసాము అన్న విషయం చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలంటున్నారు. తమను పక్కనపెడితే తమ ఉద్యమిస్తామని ఆటోవాలాలు కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: