
జగన్ కోసం పవన్ కళ్యాణ్ ను దూషించాడు ప్రజల దగ్గర పరువు పోగొట్టుకున్నాడు .. సొంత వర్గం కూడా ఆయన్ను వెలివేసింది ... చివరికి అదే జగన్… మంత్రి పదవిని పీకేసి జోగి రమేష్‌కి ఇచ్చాడు . అప్పుడు ఏమీ మాట్లాడలేకపోయారు . ఇప్పుడు అదే జోగి రమేష్ సైలెంట్ గా ఉండి.. తలుపులు తెరిస్తే టీడీపీలోకి వెళ్లేందుకు రెడీగా ఉన్నారు. కానీ ఆయన నీడ కూడా పడేందుకు అంగీకరించకపోవడంతో సైలెంటుగా ఉన్నారు. కానీ నాని మళ్లీ మైక్ పట్టుకున్నాడు – ఎందుకంటే నమ్మకంగా తల వంచిన బానిసకి ఆ పార్టీ సీటు మాత్రం పడుతుంది. పేర్ని నానితో జగన్ ఆడిన గేమ్ లో నష్టం కేవలం ఆయనకే కాదు ... ఆయన కొడుకుకూ భవిష్యత్తే లేదు. పదవిలో ఉన్నప్పుడు చేసిన వ్యవహారాలు , మాట్లాడిన మాటలు , ఇబ్బందికరమైన పనులు , రాక్షస పాలన – ఇవన్నీ కలిసి ఆయన కొడుకుకి రాజకీయంగా గేట్లు మూసేశాయి.
ప్రజల్లో "నానీ కొడుకులో నాయకత్వం లేదు, నేలమీద నడవడమే తక్కువ!" అనే టాక్ గట్టిగా ఉంది. నిజానికి ఇప్పుడు పేర్ని నానీ దగ్గర ఆత్మవిశ్వాసం కాదు, ఆత్మనింద. అదే కారణం .. ప్రజలు లెక్క చేయడం మానేశారు. ఏమి సాధించలేని స్థితిలో ఉన్నప్పటికీ , ఆయన మైక్ దగ్గరకు వెళ్తే మళ్లీ అదే మాటలు – "అరిచే కుక్క కరవదు", "ఇప్పుడే ఉద్యమించాలి", "ప్రతిపక్షాల్ని అణచాలి! కానీ … ఇక ఆ అరుపులకు ఎవ్వరూ వినేవాళ్లు లేరు. వాటి వెనుక ఉన్న శూన్యత అందరికీ అర్థమైంది . జగన్ రెడ్డి కోసం నానీ తాను తానే తాకట్టు పెట్టుకున్నాడు … చివరకు జీవితం మొత్తం నాశనం చేసుకున్నాడు.ఇప్పటికైనా శాంతంగా కూర్చోండి నానీ గారు … ప్రజల మెప్పు కోసం మళ్లీ ఫైట్ చెయ్యండి. ఆఒక్క దారి మిగిలింది … మిగతా మాటలు అన్నీ అర్ధం లేని అరుపులే !