ఏ నియోజకవర్గం చూసినా... ఇప్పుడు ఫుల్ యాక్షన్ మోడ్‌లో ఉంది. నిన్న మొన్నటి వరకూ కనిపించని మంత్రులు.. ఇప్పుడు ప్రజల మధ్యకు వచ్చేస్తున్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంతో ఈ క్రికెట్ మ్యాచ్‌కి టాస్ అయిపోయినట్టే! మంత్రులు ఎక్కడికక్కడ హడావుడిగా తిరుగుతున్నారు. నియోజకవర్గాల్లో మూడేళ్ళుగా కాళ్లు పెట్టని నేతలు.. ఇప్పుడు డైరెక్ట్‌గా డోర్‌డెలివరీ చేస్తున్నారంటే పరిస్థితి ఎంత హీటెక్కిందో అర్థం చేసుకోవచ్చు! ఇంతలా ఒక్కసారిగా గేర్ మారడానికి అసలైన కారణం మంత్రి వర్గ విస్తరణపై సీఎం చంద్రబాబు తీసుకోబోయే కీలక నిర్ణయమే! పార్టీ వర్గాల్లో ఇదే టాపిక్. కొందరిని పక్కకు పెట్టి, కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు చంద్రబాబు ప్లాన్ రెడీ చేసుకున్నట్టు సమాచారం.
ఇప్పటికే రెండు మూడు సర్వేలు తెప్పించుకొని, వారి పనితీరు గమనించి... చంద్రబాబు తన మైండ్‌లో ఫిక్స్ అయిపోయినట్టు తెలుస్తోంది. దీంతో, రెడ్ జోన్లో ఉన్న మంత్రులు – ఎవరినీ అడగకుండానే రంగంలోకి దిగిపోయారు. వంగలపూడి అనిత వంటి వారు అయితే కాలికి బెయిల్ కట్టుకుని తిరుగుతున్నారు. మంత్రి అనిత, సవిత, అనగాని సత్యప్రసాద్, కొండపల్లి రాంప్రసాద్ రెడ్డి సహా 10 మందికి పైగా మంత్రులు ఇంటికే తాళం వేసి, నియోజకవర్గాల్లో టెంట్ వేసేసారు. ప్రజలతో కలుస్తున్నారు, సభలు నిర్వహిస్తున్నారు, వైసీపీ పాలన దోపిడి ఎలా జరిగిందో చాటుతున్నారు. ఒక్కరోజులో నాలుగైదు నియోజకవర్గాల్లో పర్యటన చేయడమే కాకుండా, ప్రజల సమస్యలు వినడం, వాటి పరిష్కారాల మీద చర్చించడం... ఇలా పబ్లిక్ కనెక్ట్‌కి సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్నారు. .
ఉమ్మడి గోదావరి, అనంతపురం జిల్లాల్లో మంత్రుల జోరు మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతా చేస్తే కూడా చంద్రబాబు కరుణిస్తారా? అన్నదే ఇప్పుడు హాట్ క్వశ్చన్. ఎందుకంటే.. ఆయన చేతిలో ఇప్పటికే స్పష్టమైన రిపోర్ట్స్ ఉన్నాయట. ఎవరు పనికిరారు, ఎవరు ప్రజల్లోకి వెళ్లలేరు అన్నది ఆయనకు తెలుసట. ఇక సింగపూర్ టూర్ ముగిసాక చంద్రబాబు తీసుకోబోయే నిర్ణయమే, మంత్రుల భవితవ్యాన్ని నిర్ణయించనుంది. ఇక మిగిలింది... ఎవరు టికెట్ కొట్టుకుంటారు? ఎవరు బయటకే తిక్క పెట్టించుకుంటారు? అన్నదే చూడాల్సిన సస్పెన్స్!