
ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మహిళలు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఏదైనా ఒక గుర్తింపు కార్డును తమ వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు కార్డులు ఈ ప్రయాణానికి చెల్లుబాటు అవుతాయి. ఈ నిర్ణయం రాష్ట్రంలోని లక్షలాది మంది మహిళలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని, వారి దైనందిన జీవితంలో గణనీయమైన మార్పును తీసుకువస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం తీసుకున్న ఒక ముఖ్యమైన ముందడుగుగా ఈ నిర్ణయం పరిగణింపబడుతుందని చెప్పవచ్చు. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులలో ఉచితంగా ప్రయాణించే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తోంది. ఈ పథకం అమలులో ఎదురయ్యే సవాళ్లు, సమస్యలను అధిగమించే దిశగా ఏపీ సర్కార్ అడుగులు వేస్తుండటం గమనార్హం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ వల్ల కోట్ల సంఖ్యలో మహిళలు ప్రయోజనం పొందే ఛాన్స్ ఉంది. ఏపీ సర్కార్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరుస్తోంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు