
జగన్ వద్ద రాయబారం సాగిందా? వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌కి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఓ కీలక నాయకుడు ఈ మధ్య రాయబారం నడిపినట్టు సమాచారం. పార్టీకి, వ్యక్తిగతంగా జగన్‌కి చేసిన సేవలను గుర్తు చేస్తూ విజయసాయిరెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకోవాలని కోరినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీ నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా ఆయన జగన్ గురించి ఒక్క తప్పుడు మాట కూడా మాట్లాడలేదని, ఇది ఆయన విధేయతకు నిదర్శనమని చెబుతున్నారు. జగన్ మాత్రం ..? జనరల్‌గా తక్షణ నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా ఉన్న జగన్ ఈ విషయంలో మాత్రం దూరంగా ఉండటం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. కారణం – పార్టీలో పలువురు నేతలు విజయసాయిరెడ్డిపై అసహనం వ్యక్తం చేస్తుండటమే. ముఖ్యంగా కాకినాడ సీ పోర్ట్ వివాదం, లిక్కర్ స్కాం కేసుల్లో ఆయన పాత్రపై ఆరోపణలు రావడం, మీడియాతో మాట్లాడటం వల్ల వైసీపీ ఇబ్బందుల్లో పడిందని ఆగ్రహంగా ఉందట.
ట్రబుల్ షూటర్ మళ్లీ అవసరమా? .. పార్టీలో ప్రస్తుతం ఢిల్లీలోని సంబంధాల పరంగా, సమన్వయం పరంగా గ్యాప్ ఏర్పడిందని అంటున్నారు. ఇలాంటి సమయాల్లో విజయసాయిరెడ్డి వంటి లాబీయింగ్ స్కిల్స్ ఉన్న నేత అవసరం అనిపిస్తోంది. అందుకే పార్టీలో ఓ వర్గం – “ఇతనిని తిరిగి తీసుకుంటే పార్టీకి మేలే” అనే దిశగా ఆలోచన చేస్తోంది. రీ ఎంట్రీ వల్ల కలిగే ప్రభావం? .. విజయసాయిరెడ్డి తిరిగి వస్తే, ప్రస్తుతం కూటమిలో ఉన్న కొందరు అసంతృప్త నేతలు కూడా వైసీపీ వైపు రావొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఆయన్ను సైలెంట్‌గా తీసుకుంటే పార్టీకి గౌరవం, వ్యూహాత్మక బలమిస్తుందని భావిస్తున్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డి రీ ఎంట్రీపై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది కేవలం ఓ వ్యక్తిగత నిర్ణయం కాదు – వైసీపీ భవిష్యత్తు వ్యూహంలో కీలక మలుపు అవుతుంది. "ఆయన రాకతో పార్టీకి ఊపొస్తుందా? లేక మళ్లీ కలహాలే మిగిలిపోతాయా?" అనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్!