
\కాబట్టి గెలుపు ఇరువురి పార్టీలకూ ప్రతిష్టాత్మకమైన విషయం. వైసీపీకి ఇది ‘బలం ఇంకా మనదే’ అనే నిరూపణ అయితే, అధికార కూటమికి ‘జగన్ గడ్డలోనూ మనదే పట్టు’ అని చూపించే అవకాశంగా మారింది. తాజా పరిణామల ప్రకరం, ఈసారి విజయం టీడీపీ కూటమిదే అని ధీమాగా చెబుతున్నారు. 11కి పైగా ఇండిపెండెంట్లు నామినేషన్లు వేయడం ప్రజాస్వామ్యం పట్ల ఉత్సాహాన్ని చూపిస్తోందని కూటమి నేతలు అంటూన్నరు. మరోవైపు వైసీపీ మాత్రం, రాష్ట్రం అంతా తమ గ్రాఫ్ మళ్లీ పెరిగిందని, ప్రజా మద్దతు తిరిగి వస్తోందని చెప్పుకుంటోంది. జగన్ పర్యటనల్లో జన సమూహం రావడం కూడా వారికీ ధైర్యం ఇస్తోంది.
ఈ ఎన్నికలో గెలిస్తే కూటమి, జగన్ సొంత ఇలాకాలోనే ఆయన బలహీనతను చాటే అవకాశం పొందుతుంది. అదే ఓటమి అయితే, కనీసం నైతికంగానైనా వైసీపీని డీమోరలైజ్ చేయగలమనే భావన. వైసీపీ గెలిస్తే, ‘మన బలం ఇప్పటికీ అటే ఉందని’ చెప్పుకునే అవకాశం ఉంటుంది. అయితే, కుప్పం ఉదాహరణను గుర్తు చేస్తూ కొంతమంది చెబుతున్నారు – ఉప ఎన్నికల ఫలితాలు సార్వత్రిక ఎన్నికలకు అద్దం కావు. కానీ, పులివెందుల ఓటమి లేదా గెలుపు ఎవరికి ఏ మానసిక బలాన్ని ఇస్తుందో… అదే వచ్చే నెలల్లో రాజకీయ దిశని మార్చే శక్తి కలిగి ఉంటుంది. కాబట్టి ఈ చిన్న ఉప ఎన్నిక… రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది.