
.
1).వస్త్ర రంగం:
అమెరికా సుంకాల ప్రభావం వల్ల అత్యధికంగా భారతదేశంలో వస్త్ర రంగంపైనే పడుతుంది. వస్త్రాలపై సుఖాలు దాదాపుగా 64 శాతానికి చేరుతాయి రూ.90 వేల కోట్ల రూపాయలకు పైగా విలువైన ఎగుమతుల పైన ఈ సుంకాల ప్రభావం చూపుతోందట. దీనివల్ల బంగ్లాదేశ్, కంబోడియా, వియత్నాం, మెక్సికో, ఇండోనేషియా వంటి దేశాలకు చాలా ప్రయోజనాలు కలిగిస్తాయి.
2). వజ్రాలు ,ఆభరణాలు:
అమెరికా సుంకాల పెంచడం వల్ల ఇండియాలో రత్నాలు, ఆభరణాల పరిశ్రమ పైన రూ.85 వేల కోట్ల రూపాయల విలువైన భారతదేశం ఎగుమతుల పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఇండియాలో సూరత్, ముంబై వంటి ప్రాంతాలలో లక్షలాదిమంది డైమండ్ కట్ పరిశ్రమపైనే ఆధారపడి జీవిస్తున్నారు. దీనివల్ల అంతర్జాతీయ పోటీలలో కూడా భారతదేశం ఎన్నో సవాల్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఇటలీ, ఫ్రాన్స్ , టర్కీ, చైనా వంటి పరిశ్రమలు పట్టు బిగించేలా చూస్తున్నాయి.
ఇండియా పై విధించిన సుంకాల వల్ల థాయిలాండ్ కు వాట పెరగవచ్చు. అలాగే టర్కీ కూడా బంగారు ఆభరణాలు ఎగుమతి చేసే వాటిలో ఇండియా స్థానాన్ని ఆక్రమించుకోగలదు.
3). రొయ్యలు, సముద్ర ఉత్పత్తులు:
ఇండియా నుంచి ఎగుమతి అయ్యే సిఫుడ్ పైన తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని ఆందోళన చెందుతున్నారు. భారత్ నుంచి అమెరికాకు రొయ్యలు ఎగుమతి అవుతున్నాయి.. ఇప్పుడు ఈ సుంకాల ప్రభావం వల్ల సుమారుగా రూ.20వేల కోట్ల రూపాయల ప్రభావం పడుతుందట. దీంతో అమెరికా మార్కెట్లో భారత్ తన స్థానాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉన్నది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా వంటి ప్రాంతాలలో లక్షలాది మంది ఉపాధిని కోల్పోతారు. ప్రపంచంలోనే రొయ్యల ఎగుమతిలో ఇండియా అగ్రస్థానంలో కలదు.
వియత్నాం, ఈక్వెడార్, ఇండోనేషియా ,వంటి దేశాలకు భారత్ నష్టాలతో చాలా ప్రయోజనాన్ని అందుకుంటారు.
4). ఆటో రంగం:
ఆటో రంగంలో వీడి భాగాలపైన 50% సుంకం విధిస్తూ అమెరికా తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో భారత్ కు పెద్ద దెబ్బ పడుతుంది. ప్రతి ఏటా సుమారుగా రూ .58 వేల కోట్ల రూపాయలు విలువైన ఆటో విడిభాగాలను అమెరికాకు ఇండియా నుంచి ఎగుమతి చేస్తోంది. వీటి పైన ఎక్కువ సుంకం విధించడంతో ఇప్పుడు ఎగుమతులు తగ్గే అవకాశం కూడా ఉన్నది.
మెక్సికో, యూఎస్, కెనడా వంటి వాటికి జీరో డ్యూటీ ప్రయోజనాల వల్ల మెక్సికోకి చాలా ప్రయోజనం పొందవచ్చు. ఇప్పటికే అమెరికాకు ప్రధాన ఆటో విడిభాగాలలో మెక్సికో సరఫరా దారిగా వ్యవహరిస్తోంది . థాయిలాండ్, ఇండోనేషియా, వియత్నాం వంటి దేశాలకు బాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం వీటికి టారిఫ్ రేట్లు15- 20 శాతం మధ్యలోనే ఉన్నాయి.
5). రసాయనాలు, సేంద్రియ ఎరువులు:
ఈ రంగం నుంచి అమెరికాకి రూ.23 వేల కోట్ల రూపాయల విలువైన భారత్ ఎగుమతులు చేస్తూ ఉన్నది. పెరిగిన సుంకాల కారణం వల్ల భారతీయ ఉత్పత్తులు అమెరికాలో భారీ ఖరీదైనవిగా ఉంటాయి. దీని వల్ల వీటి ఆర్డర్లు తగ్గిపోతాయి. కలుపు మందులు, సేంద్రియ ఎరువులు, హైప్లోక్లోరైట్ మరికొన్ని ఎరువులకు డిమాండ్ పడిపోయే అవకాశం ఉన్నది. జపాన్, దక్షిణ కొరియా వంటి వాటికి తక్కువ సుంకం చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి వాటి ఉత్పత్తులు అక్కడ చౌకగా లభిస్తాయి. అలాగే చైనాలో కూడా కర్మాగారాలు పెద్దవిగా ఉంటాయి అక్కడ వస్తువులు కూడా చౌక ధరకే లభిస్తాయి... థాయిలాండ్, బంగ్లాదేశ్, వియత్నాం చౌకగాని అమెరికాకు అందించగలవు.
రష్యా నుంచి ఇండియా క్రమం తప్పకుండా చమూరు కొనుగోలు చేయడం వల్లే భారత్ పైన అదనంగా 25% వరకు అమెరికా సుంకం విధించినట్లు వెల్లడించింది. మరి రష్యా నుంచి చమురు వ్యవహారంపై భారత్ పురాలోచనా చేస్తుందేమో చూడాలి మరి. లేకపోతే ఇతర మార్కెట్ల పైన దృష్టి సాధించి, కొత్తదారులు వెతుక్కునేలా చూస్తారేమో చూడాలి.