కేసీఆర్ ఫ్యామిలీని ముక్కలు చేయడమే హరీష్ రావు లక్ష్యమా అంటే నిజమే అంటుంది కవిత.. ఎందుకంటే తాజాగా పెట్టిన ప్రెస్ మీట్ లో కవిత మాటలు అలాగే ఉన్నాయి.తండ్రిని అన్నని విమర్శించకుండా కేవలం హరీష్ రావు,సంతోష్ రావులనే విమర్శిస్తూ బీఆర్ఎస్ పార్టీని,నా ఫ్యామిలీని ముక్కలు చేయడమే హరీష్ రావు లక్ష్యం అన్నట్లుగా మాట్లాడుతోంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ నుండి తనని సస్పెండ్ చేయడం గురించి కవితప్రెస్ మీట్ అరేంజ్ చేసి అందులో సంచలన వ్యాఖ్యలు చేసింది.. కవిత మాట్లాడుతూ.. నేను నాన్న గారితో కమ్యూనికేషన్ ని కోరుకోవడం లేదు. ఆయన చాలా పెద్దవారు. పార్టీ ని పునర్మించుకోవడానికి ఆయనకి కొన్ని పనులు ఉంటాయి. కానీ నన్ను విమర్శించినప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఏమైంది బేటా అని కాల్ చేసి రామన్న నన్ను అడగొద్దా..రామన్న ఎందుకు నాకు ఫోన్ చేయలేదు ఇదొక్కటే నేను అడుగుతున్నాను. 

అలాగే హరీష్ రావు కేసీఆర్ ఫ్యామిలీని ముక్కలు చేయాలి అనుకుంటున్నారు. నన్ను పార్టి నుండి సస్పెండ్ చేసినా ఏం కాదు.అది హరీష్ రావు వేసుకున్న ప్లాన్..నన్ను పార్టీ నుండి ఎలిమినేట్ చేశారు. రేపు రామన్నను ఆ తర్వాత నాన్నను కూడా ఎలిమినేట్ చేస్తారు.మొత్తం తప్పించి పూర్తిగా వారి చేతుల్లోకి తీసుకోవాలనేదే ఆయన లక్ష్యం. ఇక నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తే నాకు నాన్నతో ఏమీ కాదు.ఎందుకంటే మాది రక్తసంబంధం. పార్టీ నుండి తీసేసిన కూడా అన్నతో నాన్నతో బంధం అలాగే ఉంటుంది. రాజకీయాల్లో ఇవన్నీ కామన్..కానీ హరీష్ రావుకి రేవంత్ రెడ్డికి ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి హరీష్ రావు ఎప్పుడైతే ఇద్దరు ఒకే ఫ్లైట్లో ఢిల్లీ నుండి హైదరాబాద్ కో లేక హైదరాబాద్ నుండి ఢిల్లీకో వెళ్లినప్పుడు వారు కొన్ని విషయాలు మాట్లాడుకున్నారు. కవితను బీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేసేలా చూడు అని అన్నారు.

రేవంత్ రెడ్డి చెప్పినట్టే హరీష్ రావు చేశారు.ఆ రోజు ఫ్లైట్లో రేవంత్ రెడ్డి కాళ్లు హరీష్ రావు పట్టుకున్నారు.అందుకే ఇదంతా జరుగుతోంది.నన్ను తీసేసి ఆ తర్వాత అన్నను ఆ తర్వాత తండ్రిని లేకుండా చేసి పార్టీని చేతుల్లోకి తీసుకోవాలనుకుంటున్నారు.ఫ్లైట్లో జరిగింది నిజమా కాదా..నాకు హరీష్ రావు,రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది కవిత.అయితే కవిత మాటలు చూస్తుంటే హరీష్ రావు కేసీఆర్ ఫ్యామిలీని ముక్కలు చేయాలనే ఇలా నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేయించారని అంటుంది.మరి హరీష్ రావే వెనకుండి ఇదంతా చేయిస్తున్నారా ? కేసీఆర్ నుండి ఒక్కొక్కరిని దూరం చేసి బీఆర్ఎస్ పార్టీని తన చేతుల్లోకి తీసుకుంటారా.. కవిత మాట్లాడిన మాటల్లో ఎంత నిజం ఉంది అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: